YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోయ్యలు, చేపలు హోమ్ డెలివరీ

రోయ్యలు, చేపలు హోమ్ డెలివరీ

ఏలూరు, ఫిబ్రవరి 21,
ఏపీలో ఇప్ప‌టికే ఇంటి ముందుకే రేష‌న్ బియ్యం, స‌రుకులను మొబైల్ వాహ‌నాలు ద్వారా అందిస్తున్న ప్ర‌భుత్వం.. ఇకపై చేప‌లు, రొయ్య‌ల‌ను కూడా మొబైల్ వాహ‌నాలు ద్వారా ఫిష్ ఆంధ్ర పేరుతో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ద‌మైంది. ఇందుకోసం ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 70 ఫిష్ హ‌బ్‌లు ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసింది. ఒక్కో హ‌బ్‌కు మ‌త్య్స ఉత్ప‌త్తుల యూనిట్ల‌తో పాటు 14 వేల రిటైల్ అవుట్ లెట్లు, రిటైల్ వెండింగ్ పుడ్ కోర్టులు, మొబైల్ యూనిట్లు ఉండ‌నున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు 56 హ‌బ్‌లు సిద్దం చేసింది ప్ర‌భుత్వం. వీటికి అనుబందంగా దుకాణాలు కూడా అందుబాటులోకి తెనున్నారు. ఇదే క్ర‌మంలో ఈ కామ‌ర్స్(E-commerce) యాప్ ద్వారా కూడా మ‌త్య్స ఉత్ప‌త్తులు అమ్మ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తోంది. మొబైల్ వాహ‌నాలు ద్వారా లైవ్ ఫిష్, రొయ్య అమ్మ‌కాల‌కు కోసం ల‌బ్దిదారుల ఎంపిక కూడా ప్ర‌భుత్వం పూర్తి చేసింది.  ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన ఫిష్ ఆంధ్ర వ‌ల‌న వినియోగ దారుల‌తోపాటు.. రైతుల‌కు లాభం చేకూరుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం మ‌న ద‌గ్గ‌ర ఉత్పత్తి అయ్యే చేప‌లు, రోయ్య‌లు దేశ, విదేశాల్లో అమ్మ‌కాలు జరుగుతున్నాయి. వేల కోట్ల ఎగుమ‌తులు జ‌రుగుతున్నాయి. అయితే ఇక్క‌డ ఎగుమ‌తుల‌ను నాణ్య‌త పేరుతో లేదా ఇత‌ర త‌నిఖీల పేరుతో అక్క‌డ తిర‌స్క‌రించ‌డంతో రైతులు న‌ష్ట‌పోతున్నారు. క‌రోనాకాలంలో వివిధ దేశాల‌కు ఎగుమ‌తులు నిలిచిపోవ‌డం.. ఎగుమ‌తులు చేసిన‌ వాటికి కూడా ఇబ్బందులు రావ‌డం వంటి అంశాల‌ను దృష్టిలో పెట్టుకున్న ప్ర‌భుత్వం..ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ఏర్పాటు చేసి.. ఈ దిశగా ముందుకెళ్తుంది.రాష్ట్రంలో ప్రతి చోటా చికెన్, మ‌ట‌న్ షాపులు ఉన్నాయి. కానీ అదే స్థాయిలో చేప‌లు, రొయ్య‌లు షాపులు లేవు. చికెన్, మ‌ట‌న్ కంటే చేప‌లు చిన్నా, పెద్ద‌ల‌కు పూర్తి స్థాయిలో పోష‌క విలువులు అందించే ఫుడ్. ఇలా అన్ని అంశాల‌ను దృష్టిలో పెట్టుకోని ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక సిద్దం చేసింది. ఇంటింటికి రేష‌న్, ఇత‌ర ఈ కామ‌ర్స్ వ‌స్తులు వ‌లే.. త్వ‌ర‌లో చేప‌లు, రొయ్య‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. చేప‌లు,రోయ్య‌లను కూడా ప్రాసెసింగ్ చేసి మ‌రీ అమ్మ‌కాలు చేప‌ట్ట‌డంతో ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నున్న ఫిష్ ఆంధ్రకు డిమాండ్ పెరిగే అవ‌కాశం ఉంది.

Related Posts