ఖమ్మం
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(49) హాఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర సంతాపం ప్రకటించారు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణ వార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని, తను మంచి మిత్రుడిని కోల్పోయానని మంత్రి అజయ్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త, రాజకీయవేత్తగా గౌతమ్ రెడ్డి సేవలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.