YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చినజీయర్ పై రీవెంజే కారణమా...

చినజీయర్ పై రీవెంజే కారణమా...

హైదరాబాద్, ఫిబ్రవరి 21,
కేసీఆర్ మ‌హా ఖ‌త‌ర్నాక్‌. కోపం వ‌స్తే కుటుంబ స‌భ్యుల‌నైనా తొక్కేస్తార‌నే పేరు. గ‌తంలో అల్లుడు హ‌రీష్‌రావు.. ఇప్పుడు కూతురు క‌విత‌. డౌట్ ఉంటే వారిని అడిగితే చెబుతారు కేసీఆర్ ఎంత డేంజ‌ర‌సో. లేటెస్ట్‌గా.. చిన‌జీయ‌ర్ స్వామిపై కేసీఆర్‌కు ఆగ్ర‌హం క‌లిగింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శిలాఫ‌ల‌కంపై త‌న పేరు లేక‌పోవ‌డం.. ప్ర‌ధాని మోదీని తెగ పొగిడేయ‌డం.. కేసీఆర్ కోపానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. అందుకే, ముచ్చింత‌ల్ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు ముఖ్య‌మంత్రి. మోదీ సంద‌ర్శ‌న‌కు డుమ్మా కొట్టడానికి రాజ‌కీయ కార‌ణాలు ఉన్నా.. పూర్ణాహుతికి, శాంతి క‌ల్యాణానికి గౌర్హాజ‌రు కావ‌డం మాత్రం చిన‌జీయ‌ర్ స్వామి మీద అక్క‌సుతోనేన‌ని అంటున్నారు. ఇక స్వామిజీతో పాటు మైహోం రామేశ్వ‌ర్‌రావులు ఎంత‌గా కేసీఆర్‌ను కూల్ చేసే ప్ర‌య‌త్నం చేసినా.. అది వ‌ర్క‌వుట్ కాలేదు. కేసీఆర్ క‌ర‌గ‌లేదు. పైగా.. చిన‌జీయ‌ర్‌పై రివేంజ్ చ‌ర్య‌లు మ‌రిన్ని చేప‌ట్టారని అంటున్నారు.
యాదాద్రి ఆల‌య‌ పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించాల్సిన శ్రీ సుద‌ర్శ‌న నారసింహా మహాయాగంను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్ర‌కార‌మైతే.. మార్చి 28వ తేదీన మహా కుంభ సంప్రోక్షణ జ‌ర‌గ‌నుంది. అందుకు 8 రోజుల ముందునుంచి అంటే.. మార్చి 21 నుంచి 28 వ‌ర‌కూ మ‌హాయాగం చేయాల‌ని ఇంత‌కుముందే నిర్ణ‌యించారు. దేశ న‌లుమూల‌ల నుంచి అతిథులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలను ఆహ్వానించారు. 10వేల మంది రుత్వికుల‌తో మహా సుదర్శన యాగం జ‌ర‌గాల్సి ఉంది. ఇప్ప‌టికే ఏర్పాట్లు సైతం మొద‌లైపోయాయి. అలాంటిది.. స‌డెన్‌గా ఆ యాగంను వాయిదా వేస్తూ ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఎందుకు అనేదే ఇప్పుడు చ‌ర్చ‌ణీయాంశం. మ‌హా యాగం.. చిన‌జీయ‌ర్ నేతృత్వంలో జ‌ర‌గాల్సి ఉంది. ఇటీవ‌ల జీయ‌ర్ స్వామిపై కేసీఆర్‌కు కోపం రావ‌డంతో.. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో యాగం చేయ‌డం ఇష్టం లేకే.. ఏకంగా యాగాన్నే వాయిదా వేశార‌ని అంటున్నారు. స‌మ‌యానికల్లా ఏర్పాట్లు పూర్తి కావ‌డం లేద‌ని అందుకే మ‌హా యాగాన్ని వాయిదా వేశార‌ని అధికారులు చెబుతున్నా.. అవి న‌మ్మే కార‌ణాలుగా లేవంటున్నారు. అయితే, పంచనారసింహుల మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిర్ణయించినట్లుగానే మార్చి 28నుంచే ప్రారంభమవుతుందని ప్రకటించారు. మహాకుంభ సంప్రోక్షణ చేపట్టిన తర్వాత ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. మ‌రోవైపు, చిన‌జీయ‌ర్ స్వామితో పాటు.. ప్ర‌ధాని మోదీ సైతం ఆ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించాల్సి ఉండ‌గా.. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో మోదీని పిల‌చే ఉద్దేశం కేసీఆర్‌కు అస‌లేమాత్రం లేదు. అదికూడా ఓ కార‌ణం కావొచ్చ‌ని చెబుతున్నారు. ఇటు మోదీతో విభేదాలు.. అటు చిన‌జీయ‌ర్‌పై ఆగ్ర‌హంతో.. ఏకంగా శ్రీ సుద‌ర్శ‌న నారసింహా మహాయాగంనే వాయిదా వేయ‌డం.. కేసీఆర్ పెంకిత‌నానికి, పంతానికి, ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Related Posts