అమరావతి
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరం. ఏపీ లో పెట్టుబడుల కోసం పరిశ్రమలు మరియు ఐటీ శాఖా మంత్రిగా ఎంతో కృషి చేస్తున్న మంత్రి గౌతమ్ రెడ్డి. నిన్నటి వరకు కూడా రాష్ర్టంలో పెట్టుబడుల కోసం దుబాయ్ లో పర్యటించిన మేకపాటి గౌతంరెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసింది. మేకపాటి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియపరిస్తున్నాను. గౌతమ్ రెడ్డి మరణం పార్టీ కి ప్రజలకు తీరని లోటు -తుది శ్వాస వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేసిన గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని అన్నారు.