YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

హైదరాబాద్, ఫిబ్రవరి  21,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం వెనక అసలేం జరిగింది? రాత్రి అందరితో కలసి నిశ్చితార్ధంలో పాల్గొన్న మంత్రి గౌతమ్ రెడ్డి. ఉదయానికల్లా మృతి చెందడానికి అసలు సిసలు కారణాలేంటి? ఉదయం ఎన్నింటికి ఆయనకు గుండె పోటు వచ్చింది? ఎంతో కూల్ గా ఉండే మేకపాటికి హార్ట్ అటాక్ ఎలా వచ్చింది? ఎంతో కఠిన వ్యాయామాయాలను చేసే గౌతమ్ రెడ్డికి ఈ అనారోగ్యమేంటి? ఎక్కడైనా హోటల్ లో దిగినా సరే జిమ్ ఫెసిలిటీ చూసుకునే వ్యక్తికి ఇలాంటి దుర్మరణం ఎలా వచ్చింది? అన్నదిపుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. అయితే సోమవారం ఉదయం గౌతమ్‌‌రెడ్డి మరణానికి ముందు 90 నిమిషాల పాటు ఏం జరిగింది…మేకపాటికి ఉదయం ఐదున్నర ఆరు గంటలకు నిద్ర లేచి కాఫీ తాగే అలవాటు. కానీ ఈ రోజు మాత్రం గౌతమ్ కాఫీ తాగలేదు. ఉదయం 7. 20కి సోఫాలో వచ్చి కూర్చున్నారు. ఆ వెంటనే కుప్పకూలిపోయారు. చెమటలు పట్టడం గుర్తించి ప్రాథమిక వైద్యం అందించారు. ఆ వెంటనే ఆయన్ను అపోలోకి చేర్చారు. ఆ తర్వాత డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించారు. కానీ అవేవీ ఫలించలేదు. సరిగ్గా సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు చికిత్స అందించిన అపోలో వైద్యులు ధృవీకరించారు.కాగా.. ఉదయం 7:30 గంటలకు జిమ్‌కు వెళ్దామని సిద్ధమయ్యారని.. ఇంట్లో నుంచి బయటికి రాకముందే ఛాతిలో నొప్పిగా ఉందని సోఫాలోనే కూర్చుకున్నారని గౌతమ్ ఇంటి వంట మనిషి కొమురయ్య చెబుతున్నారు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు, గన్‌మెన్‌లు అపోలో ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆయన మృతిచెందారు. గౌతమ్‌రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్యరెడ్డి, కుమారుడు అర్జున్‌రెడ్డి ఉన్నారు. మంత్రి మృతిపట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, పలువురు పారిశ్రామికవేత్తలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇంట్లో పనిమనుషులు కొమరయ్య, చందు ఇచ్చిన సమాచారం ప్రకారం ఓసారి చూద్దాం.
>> ఉ 7.00 – నిద్రలేచిన గౌతమ్‌ రెడ్డి
>> ఉ 7.10- బెడ్‌రూమ్‌ నుంచి బయటకి, సోఫాలో కూర్చున్న గౌతమ్‌రెడ్డి
>> ఉ 7.15- కాఫీ ఇచ్చిన వంటమిషని, వద్దన్న గౌతమ్‌
>> ఉ 7.25- చమటలు పడుతున్నాయంటూ గుండెపట్టుకున్న గౌతమ్‌
>> వెంటనే భార్య కీర్తి, కుమార్తె అనన్యకు పనిమనుషుల సమాచారం
>> ఉ 7.30- అప్పటికే స్పృహతప్పినట్లు గుర్తించిన కుటుంబీకులు
>> కాసేపు సపర్యలు చేసిన కుటుంబీకులు
>> ఉ 7.45 – అపోలో ఆస్పత్రికి చేరిక
>> ఉ 9.00 – చనిపోయినట్లు నిర్దారించిన వైద్యులు
7.45 నుంచి దాదాపు 8.55 వరకూ.. అంటే దాదాపు 90 నిమిషాల పాటు ఆస్పత్రిలో CPR జరిగింది. అప్పటికీ బాడీ రెస్పాండ్ కాలేదు. ఇక ఆఖరి ప్రయత్నాలు ఫలించకపోవడంతో 9గంటల ప్రాంతంలో ఆయన చనిపోయిటన్లు ధృవీకరించారు. ఆయన మరణంపై అపోలో వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం 9.16 గంటలకు గౌతమ్‌రెడ్డి మృతిచెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ‘గౌతమ్‌రెడ్డి ఇంటి దగ్గర కుప్పకూలారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్‌రెడ్డిని అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్పందించని స్థితిలో గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆయన ఆస్పత్రికి వచ్చే సమయానికి శ్వాస ఆడట్లేదు. అత్యవసరం విభాగంలో తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని వైద్యులు ప్రకటించారు.

రెండు  రోజులు సంతాప దినాలు :
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలను పాటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం నాడు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. అటు మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డి తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని తెలిపారు. ఉదయం 7.45 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని… కార్డియాక్ అరెస్టు రావడం వల్ల ఊపిరి తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. 90 నిమిషాల పాటు CPR చేశామని… అడ్వాన్స్‌డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్‌పై ఉంచామని.. అయినా ఆయన ప్రాణాలు దక్కలేదని ప్రకటించారు. సోమవారం ఉదయం 9:16 గంటలకు గౌతమ్‌రెడ్డి మరణించారని వారు తెలిపారు.
బుధవారం అంత్యక్రియలు
మంగళవాం ఉదయం ఎయిర్‌ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. నెల్లూరులో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు.. ఇక, బుధవారం ఉదయం నెల్లూరు నుంచి బ్రాహ్మణపల్లికి అంతిమయాత్ర సాగనుండగా.. మధ్యాహ్నం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు.. ఉదయం స్వగ్రామంలో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు మేకపాటి గౌతమ్‌రెడ్డి అని గుర్తుచేశారు.. సీఎం జగన్‌తో అత్యంత సన్నిహితుడుగా ఉన్నారని.. ఈరోజు అయన లేరు అని విషయాన్ని నమ్మలేకపోతున్నాం అన్నారు. స్వగ్రామంలో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయని.. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం ఇస్తామని తెలిపిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Related Posts