YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మార్చి జీతాలు కష్టమేనా

మార్చి జీతాలు కష్టమేనా

విజయవాడ, ఫిబ్రవరి 22,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫిబ్రవరి నెల జీతాలు మార్చి 1 న చేతి కొస్తాయా? ఫస్ట్’ న కాక పోయినా కనీసం ఫస్ట్ వీక్’ లో అయినా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయా? అంటే అనుమానమే అంటున్నారు అధికారులు. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులలో జాప్యం జరగని సందర్భాలు  చాలనే ఉన్నాయి. ఒక అదొక విధంగా అలవాటుగా మారి పోయింది. నిజానికి, సకాలంలో జీతాలు వచ్చిన సందర్భాల కంటే రాని సందర్భాలే ఎక్కువ అయ్యాయన్నా అది నిజమే కావచ్చును. అయితే ఇంత వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా వచ్చాయంటే, దానికో లెక్కుంది. ఖానాకు బొక్కుంది. ఆ విధంగా ఖజానా నిడుకోవడంతో అక్కడా  ఇక్కడా అప్పులు తెచ్చి, జీతాలు చెల్లిస్తూ వచ్చారు. అఫ్కోర్స్, ఇప్పుడు కూడా పరిస్థితి అదే అయినా, సకాలంలో అప్పు పుట్టినా పొరపాటున ఖజానాలో పైసలు ఉండి ఉన్నా,  ప్రభుత్వం  జీతాలు  ఇవ్వాలనే అనుకున్నా, అది అయ్యే పని కాదని అంటున్నారు. అదేమంటే, అందుకు పీఆర్సీ తిరకాసులే కారణమని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలి. అంటే, రాష్టం మొత్తంలో ఉన్న 4,96,875 మంది ఉద్యోగుల జనవరి జీతాలు 010 పద్దు కింద చెల్లించినట్లు ప్రక్రియ పూర్తి చేయాలి. అయితే, ఈ ప్రక్రియ అంత ఈజీ  వ్యవహారం కాదు. మొత్తం జీతాల ప్రక్రియ పూర్తి చేయాలంటే, డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు అధికారులు , ఖజానా అధికారులు రెండు నెలల పనిని, ఐదే ఐదు రోజుల్లో పూర్తిచేయవలసి ఉంటుంది. అంతే కాదు, దానితో పాటుగా కొత్త వేతన సవరణ ప్రకారం స్కేళ్లు తయారుచేసి అదనంగా చేర్చాల్సినవి, వారి జీతం నుంచి మినహాయించినవి తేల్చి, వాటిని ఖజానా అధికారులకు సమర్పించాలి. ఈ మొత్తం పని ఫిబ్రవరి 25లోపు.. అంటే 5రోజుల్లో పూర్తి చేయాలని ఆర్థికశాఖ అధికారులు ఉత్తర్వులిచ్చారు. ఇది అయ్యే పని కాదు. సో..ఫిబ్రవరి జీతాలు సకాలంలో అందుకోవడం కష్టమే అవుతుందని అధికారులు అంటున్నారు. మరోవంక సాధారణంగా జీతాల బిల్లులు నిర్దిష్ట గడువులోపు సమర్పించకపోతే అనుబంధ జీతాల బిల్లులు ప్రతి నెలా 5 తర్వాత సమర్పించేందుకు ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి జీతాలకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. మొత్తం జీతాల ప్రక్రియ రెండు నెలల పని రాబోయే 5 రోజుల్లో పూర్తిచేసి సమర్పించకపోతే ఫిబ్రవరి జీతాలు సకాలంలో అందుకోవడం కష్టమే అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీని 2022 జనవరి నుంచి అమలు చేసింది. అప్పట్లో ఉద్యోగులు, డీడీవోల సహాయనిరాకరణ వల్ల కొత్త పీఆర్సీ జీతాల బిల్లులు సమర్పించలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా జనవరి జీతాలు కొత్త వేతన సవరణ ప్రకారమే ఇవ్వాలనే పట్టుదలతో వ్యవహరించింది. దీంతో 24,496 మంది డీడీవోలు చేయాల్సిన పనిని ఒక ఖజానాశాఖ డైరక్టర్‌ చేసేలా ఆదేశాలిచ్చి జీతాల పద్దు నుంచి కాకుండా సస్పెన్స్‌ ఖాతా ద్వారా జనవరి జీతాలు చెల్లించింది. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలోని డీడీవోలు వాస్తవంగా ఏ ఉద్యోగికి జనవరి జీతం ఎంత ఇవ్వాలో లెక్కకట్టాలి.ఈ ప్రక్రియ మొత్తం ఈ ఫిబ్రవరి 25 లోగా పూర్తి కావాలి .. కాదంటే, ఉద్యోగులు మార్చి నెలలో జీతాల కోసం చకోర పక్షల్లా ఎదురు చూడక తప్పదని ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు.

Related Posts