ఏలూరు, ఫిబ్రవరి 22,
చావనైనా చస్తా, తల వంచేందుకు సిద్ధంగా లేను. వంగి వంగి దండాలు పెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదు. సాహసమే ఊపిరిగా వచ్చా". --జనసేనాని గర్జన. సమస్యలు వారే సృష్టిస్తారు. పరిష్కారం చూపించి మార్కులు కొట్టేస్తారు. ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదు. ఎంత పెద్ద వారైనా దేహీ.. దేహీ అని అడుక్కోవాలని అనుకుంటారు. అప్పుడే ఆయన ఈగో సంతృప్తి చెందుతుంది" --జగన్- చిరంజీవి ఎపిసోడ్‌పై పవన్ ఫైర్. పవన్ కల్యాణ్ చించేశారు. జీవో 217 కాపీలను ప్రజలందరి ముందూ చించిపడేశారు. ఆయన చింపింది జస్ట్ పేపర్లు మాత్రమే కాదు. మరో 5 రోజుల్లో తన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ఉంది. మూవీ రిలీజ్‌కు ముందు.. పీకే ఇలా జగన్‌ను చించేయడం మామూలు విషయం ఏమీ కాదు. అందుకు, ఫుల్ గట్స్ ఉండాలి. దమ్మున్నోడే అలా చేయగలడు. చావనైనా చస్తా.. తల వంచేదేలే.. వంగి వంగి దండాలు పెట్టేదేలే.. అంటూ సవాల్ చేశారు పవన్ కల్యాణ్. అన్నయ్యకు తమ్ముడికి ఎంత తేడా. జగన్‌ను కలిసిన చిరంజీవీ.. ఆయనకు దండాలు పెట్టి వేడుకున్నారు. అన్నయ్య జగన్‌రెడ్డిని అలా వేడుకుంటే.. తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం చించిపడేశారు. జగన్‌రెడ్డిపై చిందులు తొక్కారు. జగన్‌రెడ్డి యాటిట్యూడ్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేనాని. సమస్యలు వారే సృష్టిస్తారు.. పరిష్కారం చూపించి మార్కులు కొట్టేస్తారు.. ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదు.. ఎంత పెద్ద వారైనా దేహీ..దేహీ అని అడుక్కోవాలని అనుకుంటారు.. అప్పుడే ఆయన ఈగో సంతృప్తి చెందుతుంది.. అంటూ జగన్‌రెడ్డిపై పూనకం వచ్చినట్టు ఊగిపోయారు పవన్ కల్యాణ్.ఓవైపు టాలీవుడ్ వర్గాలంతా జగన్ నిర్ణయం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. సినిమా టికెట్ల ధరల పెంపు జీవో ఎప్పుడెప్పుడు వస్తుందా అని టెన్షన్ పడుతున్నాయి. అలాంటిది.. మరో 5 రోజుల్లో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ఉన్నా.. జగనన్న కావాలనే ఆ జీవో ఆలస్యం చేసే ఛాన్స్ ఉన్నా.. డోంట్‌కేర్ అంటూ.. తగ్గేదేలేదంటూ.. జగన్ ఈగోపై దారుణంగా దెబ్బకొట్టారు పవన్ కల్యాణ్. ఏం చేస్తారో చేసుకోండి అనేలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అన్నయ్య.. జగన్‌ను అలా వేడుకొని వస్తే.. తమ్ముడు జగన్‌రెడ్డిని ఇలా కెలకడం.. ఆసక్తికరంగా మారింది. జనసేనాని దూకుడుతో సినిమా టికెట్ల యవ్వారం.. మళ్లీ మొదటికొస్తుందా? అనే అనుమానం. ఎంతైనా.. పీకేనా.. మజాకా...అంటున్నారు.