విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం ఎం కె పట్నం పంచాయతీ పెద్ద పేట గ్రామ సమీపంలో వుబ్లేసు మరియు టేక్ తోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఊరికి అతి సమీపం కావడంతో గ్రామస్తులు భయభ్రాంతుల కు గురయ్యారు. విమ్మంటే సమీప కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసి లైన్ ఆఫ్ చేయించడం జరిగింది.తర్వాత నర్సీ పట్నం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్లో సంప్రదించగా అతి తక్కువ సమయం లోనే హుటాహుటిన తరలి వచ్చారు. కానీ అగ్నిమాపక వెహికల్ హైట్ గా ఉండడంతో ఎదురుగా గ్రామదేవత గుడి ముందు రోడ్డుకు అడ్డంగా పందిరి ఉండడం చే వాహనం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. విమ్మంటే అగ్నిమాపక సిబ్బంది నడుచుకుంటూ అగ్ని ప్రమాద స్థలానికి చేరుకుని పెద్ద పేట యువత సహాయంతో మంటలను అదుపు చేశారు. యువత సహాయం చేసినందుకు అగ్నిమాపక సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.