రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్రసిద్ధిగాంచిన గడికోటను పురావస్తు,పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు కోటను రాష్ట్ర ఎక్సైజ్,పురావస్తు, సాంస్కృతిక,క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కాకతీయ రాజులు నిర్మించిన అతి పురాతన గడిని మంగళవారం మంత్రులు సందర్శించారు. చారిత్రాత్మక వారసత్వ సంపదను భావి తరాలకు అందించటం లో భాగంగా నాటి చిహ్నాలను,కట్టడాలను కాపాడుతూ,మరిన్ని నూతన హంగులు,మెరుగులు దిద్ది అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. పచ్చదనం తో పాటు పలు రకాల పనులు చేపట్టి ప్రజలకు, అందుబాటులో,తేవటానికి కృషి చేస్తామన్నారు. గడికోట అభివృద్ధి పై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రులు అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి,వివిధ శాల అధికారులు, టి ఆర్ ఎస్, నాయకులు పాల్గొన్నారు.