YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు బంధు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బూర.నర్సయ్య

రైతు బంధు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బూర.నర్సయ్య

తెలంగాణా రైతులు  అప్పు చేయకుండా యాచించే స్థాయి నుండి శాసించే స్థాయి కి ఎదగాలి.   రైతులు సగర్వంగా పంట పండిచాలనే ఉద్దేశ్యం తో తెచ్చిన పథకమే రైతు బంధు పథకమని  అన్నారు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్. సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట  మండలం పెద్దకందుకురు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం  ఎకరాకు 4,000 రూ"లు  నూతన డిజిటల్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ నర్సయ్య హాజరై పాల్గొన్నారు. ఒక్క సంవత్సరం రైతులు పంట పండించకుంటే దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుందని అలాంటి పరిస్థితి ఏ ఒక్క రైతుకు రాకుండా తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలని ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు.దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఎకరాకు 4000 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పంట పండించిన రైతు నష్టపోకుండా ఉండాలన్నారు.రైతుల బాగు కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరే అన్నారు.యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకురు  గ్రామంలో జరిగిన రైతు బంధు పధకం ప్రారంభ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ స్వప్న జడ్పీటీసీ,కమలమ్మ , వివిధ శాఖ ప్రభుత్వ అధికారులు,టిఆర్ఎస్ నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Related Posts