విశాఖపట్నం
ఉత్తరాంధ్ర మన్యం బిక్కుబిక్కు మంటోంది. తమను మన్యంలో వుండ నివ్వరేమోనని భయంతో వారు బతుకుతున్నారని ఏపీసీసీ ఛీఫ్ శైలజానాథ్ ఆరోపించారు. బిజేపి ప్రభుత్వం ఆస్తులను తన ఆర్ధిక స్వార్ధం కోసం గుప్పిట్లోకి తీసుకుంటోంది. వైసిపి కూడా అందుకు వంతపాడుతోంది. ఖాళీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొండలు కూడా స్వాహా చేస్తున్నారని అయన అన్నారు.
భూముల్ని తాకట్టు పెట్టడం, అదానీకి కట్టబెట్టడం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్పీలు ప్రజా స్నేహితులా, ద్రోహులా తేల్చుకోవాలి. సిఎమ్ జగన్ కుక్కిన పేనులా వున్నారు. ఎమ్పీ లు, టిఏ, డీఏ లకోసం ఢిల్లీ వెళుతున్నారు. ప్రత్యేక ప్యాకేజి ఎజెండాలో పెట్టి తీసేస్తే చలనం లేదు. దొడ్టి దారిన బాక్సైట్ తవ్వుకుపోదామని చూస్తున్నారు.. మన్యంలో ఆరులైన్ల రోడ్డులు వేయడానికి సిద్దపడుతున్నారు. కరోనా పేరును వాడుకోవడం మీకు కలిసి వచ్చింది. మన్యాన్ని కాపాడుకుందామంటూ ఏప్రిల్ లో పాదయాత్రలు చేస్తామని అయన వెల్లడించారు.
ఆ యాత్రలో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొంటారు. స్టీల్ ప్లాంట్ గురించి ఏపి ప్రభుత్వం మాట్లాడటం లేదు ఎందుకు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగాక అమ్మేస్తారు. ఉత్తరాంధ్రప్రజలు కలిసికట్టుగా పోరాటం చేయాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ హామీలు, పునర్వ్యవస్థీకరణ చట్టంలో వున్న అంశాలను చిత్తశుద్దితో అమలు చేస్తామని అన్నారు.
మోడీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టాలి. ఉభయసభల్లో ప్రస్తుత సమావేశాలగలో తన ఎమ్పీలతో తీర్మానం చేయించాలని అయన అన్నారు.