కర్నూలు
కర్నూలు జిల్లా ఆదోని లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంగన్ వాడి, హాస్టళ్లలకు, స్కూళ్లలకు ప్రభుత్వం తరుపున సరఫరా చేసే గోడౌన్లో మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో గుడ్లు, టన్నుల జొన్న పిండి, పాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు 20లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని సబ్ కాంట్రాక్టర్ వెల్లడించారు. ప్రమాదానికి షార్ట్ సర్యుట్ కారణమని పోలీసులు అంటున్నారు.