YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బీజేపీలో ముసలం

బీజేపీలో ముసలం

ఏపీ బీజేపీలో ముసలం బుసలు కొడుతోంది.  కర్నాటక ఎన్నికల తర్వాత ఏపీపై ఆ పార్టీ దృష్టి సారిస్తోంది. అదే రీతిలో ఏపిలో సంస్కరణలు చేపట్టిన అదిష్టానం, ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలను కన్నా లక్ష్మీనారాయణకు కట్టబెట్టింది. పార్టీ అధ్యక్షుడు మార్పుపై ఎంతో కాలంగా వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ,   బలాబలగాలపై అద్యయనం చేసి చివరికి కన్నా లక్ష్మీనారాయణకు అవకాశం ఇచ్చింది. అయితే ఇదే ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. కన్నాకు అప్పగించిన పదవిపై ఎమ్మెల్సీ సోమువీర్రాజు వర్గీలు బహిరంగానే అసంతృప్తి సెగలు కక్కుతున్నారు. సీనియర్లు పక్కన పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ వ్యూహత్మకంగానే కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ భాజపా భాద్యతలను అప్పగించింది. రాజకీయాలలో దుందుడుకుగా ఉండే కన్నా 1989 మొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న కన్నా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.  నాలుగుసార్లు అదే నియోజవర్గం నుంచి ప్రాతినిద్యం వహించిన కన్నా, 2009 ఎన్నికలలో గుంటూరు 2 నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికలలో కన్నా లక్ష్మీనారాయణ ఓటమి చవిచూసారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇప్పట్లో భవిష్యత్తు లేదని గుర్తించిన ఆయన భారతీయ జనాతా పార్టీలో చేరారు. బీజెపీ కోర్ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలు , ప్రత్యర్థి పార్టీలకు గట్టి సమాధానాన్ని చెప్పేందుకు బలమైన నాయకుడుగా కన్నా భావిస్తన్న బీజేపీ,  కన్నాకు సై కొట్టి రాష్ట్ర అద్యక్ష బాధ్యతను అప్పగించింది.  కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నాకు పార్టీ పగ్గాలు ఇస్తారని  గతంలో ప్రచారం జరిగింది. అయితే పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అధ్యక్షపదవి ఇవ్వడాన్ని కొందరు తప్పపట్టడంతో అధిస్టానం ఆలోచనలో పడింది. దీంతో కన్నా సైతం పార్టీని వీడి వైసిపిలో చేరెందుకు సిద్దమైయ్యారు. ఏప్రిల్ 26న గన్నవరం నియోజకవర్గంలో జగన్ పాదయాత్రలో కన్నా వైసిపిలో చేరాల్సి ఉండగా ఆరోగ్యం సహాకరించక వాయిదా వేసుకున్నారు. అయితే ముందుగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల బాధ్యతలు అప్పగించేలా అధిష్టానం సుముఖంగా ఉందని సంకేతాలు వచ్చిన తరుణంలో అకస్మాత్తుగా కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించడంపై సోము వీర్రాజు వర్గీయులు ఖంగు తిన్నారు. కన్నాకు రాష్ట్ర పగ్గాలు ఇవ్వడం బీజెపీ వైసిపీ వర్గాలకు విస్మయాన్ని కల్గించడంతో ఆ పార్టీ జిల్లా అద్యక్ష పదవులకు రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో బీజేపీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

Related Posts