చిత్తూరు
దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంతో మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలతో, రంగు రంగుల హరివిల్లులతో ఆలయం సర్వాంగసుందరంగా సిద్ధమవుతోంది , ఇప్పటి నుంచే భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి రావడంతో ఆలయం భక్తజనసందోహంతో కిటకిటలాడుతూ ఆలయంలొ ఓంకార నామస్మరణలతో మారుమోగుతుంది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లు వివిధ వాహనాలపై కొలువుతీరి గ్రామోత్సవానికి రావడం ఆనవాయితీ అందుకుగాను, గాలిగోపురంవద్ద వాహనాలమండపంలో స్వర్ణభరితమైన వాహనాలను కొలువు తీర్చి వాహనాలను ముస్తాబు చేస్తున్నారు. శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవారు ఈ వాహనాలపై కొలువుతీరి భక్తులకు దర్శనం ఇస్తారు.4 కోట్ల భారీ వ్యయంతో 2022 మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పెద్దిరాజు తెలిపారు.. శ్రీకాళహస్తీశ్వర ఆలయ బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 24 సాయంత్రం 4గం15ని కు భక్త కన్నప్ప ధ్యజరోహణంతో వేడుకలకు అంకురార్పణ జరుగుతుంది...