YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్ తరం కాదు బీఎస్పీ నేత ఆర్ ఎస్పీ ప్రవీణ్ కుమార్

రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్ తరం కాదు బీఎస్పీ నేత ఆర్ ఎస్పీ ప్రవీణ్ కుమార్

కొమురం భీమ్ అసిఫాబాద్
భారత రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్ తరం కాదని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ పదే పడే మాట్లాడటం సరికాదన్నారు అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన బహుజన రాజ్యాధికార సంకల్ప సభకు  ముఖ్య అతిథిగా విచ్చేసిన  ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ను వ్యవసాయ చెక్ పోస్ట్ నుండి నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతము పలికారు. అనంతరం బొరిగాం శివారు ప్రాంతంలో అంబెడ్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.వీధుల గుండా  కార్యకర్తలు, నాయకులు అంబెడ్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆర్ .ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతు కె.సి.ఆర్ మరియు బి.జె.పి రాజ్యాంగాన్ని తీసేయాలి అని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.. కేంద్రం ,రాష్ట్ర ప్రభుత్వాలకు  తగిన బుద్ధి చెప్పడానికి బహుజన రాజ్యం వస్తుందని అన్నారు.కె.సి.ఆర్ దుష్ట పాలన , కోనేరు కొనప్ప ఆటవిక మాఫియాను అంతం చేయడానికి బహుజనులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.రాబోయే రోజుల్లో బి.ఎస్.పీ పార్టీ అధికారంలోకి వచ్చి అవినీతిని అంతం చేస్తుందని అన్నారు .అనంతరం ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పి చైర్మన్ సిడం గణపతి.నాయకులు కార్యకర్తలు బీఎస్పీ లో చేరారు.

Related Posts