నర్సీపట్నం
మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటికి పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు బుధవారం వచ్చారు. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ నమోదైన కేసుపై అయ్యన్న ఇంటికి పోలీసులు వచ్చారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐ లు అయ్యాన్నకు 41(A) నోటీసు ఇచ్చేందుకే వచ్చామని అన్నారు. వచ్చిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిఐ ఏ రఘు, నల్లజర్ల ఎస్ఐ ఐ అవినాష్, దేవరాపల్లి ఎస్ఐ కె శ్రీ హరి రావు వున్నారు.