విజయవాడ
కేంద్రం బడ్జెట్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అందుకే మేధావుల తో సమావేశాలు నిర్వహిస్తున్నామని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఎపి విభజన జరిగాక ఎపి కి దిశ, దశ లేకుండా పోయింది. 13జిల్లాల్లో ఉన్న వనరులు, సముద్ర తీర ప్రాంతాలను వినియోగించుకోవాలి. ఎపికి నితిన్ గడ్కరి 3లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దం అని ప్రకటించారు. ఎపి పాలించిన గత, ప్రస్తుత పాలకులు అంచనాలు చేయడంలో విఫలమయ్యారు. రాష్ట్ర ఆర్ధిక ప్రగతిని సరైన మార్గం లొ తీసుకెళ్లలేదు. అనవసర అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయకపోవడం రాష్ట్ర అభివృద్ధి కి అరిష్టమని అన్నారు.
రాజధానిని ఐదేళ్లలో చంద్రబాబు కట్టలేదు. నేను కడతాను అని వచ్చిన జగన్ రాజధానే లేకుండా చేశారు. ప్రజలను కూడా రాజధాని విషయంలో అయోమయంలోకి నెట్టారు. రాష్ట్రం లో పరిస్థితి ని ప్రక్షాళన చేయాలి. ఇది ఒక్క మోడీ సారధ్యంలో ని బిజెపి కే సాధ్యమని అన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేసి కుటుంబ పాలకులకు బుద్ధి చెప్పాలని అన్నారు.