వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పాదయాత్ర 2వేల మైలు రాయిని అందుకుంది. 161 రోజు పాదయాత్ర చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ఏలూరు సమీపంలో వెంకటాపురం వద్ద 2వేల కిలో మీటర్లను చేరుకున్నారు. ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరించారు. 13 జిల్లాలు 175 నియోజకవర్గాలు 180 రోజుల ప్రజా ప్రస్థానం ఇదీ జగన్ టార్గెట్ . ప్రజా సమస్యలు తెలుసుకుంటూ. జనంతోనే జగన్ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత ప్రజా సంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే 160 రోజులు పాదయాత్ర పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏలూరు సమీపంలో వెంకటాపురం వద్ద 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ 40 అడుగుల పైలాన్‌ను వైఎస్‌జగన్‌ఆవిష్కరించారు. సాయంత్రం ఏలూరు పాతబస్టాండ్‌సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశించిన జగన్ 13 నియోజకవర్గాల్లో దాదాపుగా 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ప్రతిపక్షనేత వైఎస్‌జగన్‌చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలు చేపట్టారు. రెండు రోజులపాటు జరిగే ఈ పాదయాత్రలో ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంచార్జ్‌లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఓవైపు మంటుడెంటలు ఉన్నా విశ్రాంతి తీసుకోకుండా జగన్ పాదయాత్ర కొనసాగించడం ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. రెండు వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకుని మూడువేల లక్ష్యం దిశగా సాగుతున్న జగన్ కి ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అభినందనలు తెలిపారు. గత ఏడాది నవంబర్ 6న ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన వైఎస్సార్సీపీ అధినేత 74వ రోజు పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని అందుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం, సైదాపురం వద్ద జగన్ వెయ్యి కిలోమీటర్ల యూత్ర పూర్తయ్యింది. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తైన సందర్భంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంఘీభావ పాదయాత్రలు నిర్వహించాయి. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని జగన్ మరో మైల్ స్టోన్ ని అధిగమించారు. ములుకుదురుకు చేరుకోగానే జగన్ పాదయాత్ర 1500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ పాటికి జగన్ పాదయాత్ర ముగింపు దశకు చేరుకోవాల్సి ఉంది. మొత్తం ఆరు నెలలు పాదయాత్ర చేయాలని జగన్ తొలుత నిర్ణయించారు. ఆ విధంగా జిల్లాలు నియోజకవర్గాల్లో టూర్ ప్లాన్ చేసుకున్నారు. నవంబర్ ఆరు నుంచి ప్రజాసంకల్ప యాత్రను పూర్తి చేయాలి ఇప్పటికే ఆరునెలలు పూర్తైనా ఇంకా ఐదు జిల్లాల్లో సంకల్ప యాత్ర పూర్తి కావాల్సి ఉంది. మధ్యలో నాంపల్లి కోర్టుకి హాజరు అవుతుండడం. ఇతర కారణాలతో పాదయాత్రకు బ్రేకులు పడుతోంది. దీంతో ముందుగా నిర్ణయించుకున్నట్లుగా కాకుండా ఆలస్యం అవుతోంది. ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బహిరంగసభల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. చంద్రబాబుని, టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. తనకు ఒక్కచాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను కోరుతూనే అధికారంలోకి వస్తే తానేం చేయబోతున్నానో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర అనంతరం తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, చివరిగా శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేయనున్నారు. జగన్ రెండువేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకోవడంతో ఆపార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినేత పాదయాత్ర దగ్విజయవంతంగా కొనసాగుతోందని. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు జనంతో జగన్ మమేకమవ్వడంవల్ల రానున్న రోజుల్లో తమపార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయాలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి.