సిద్దిపేట
రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రశంసలు కురిపించారు. హరీశ్రావు డైనమిక్ లీడర్.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. బుధవారం నాడు మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకింత చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలిలో కట్టడం సాధ్యం కాదు. భూమ్మీదనే కట్టాలి. ముంపునకు గురైన గ్రామాలకు న్యాయం చేస్తాం. భూనిర్వాసితులకు న్యాయం చేస్తామని అయన అన్నారు. . చరిత్రలో ఇప్పటి వరకు ఇవ్వని పరిహారం ఇచ్చాం. భూములు కోల్పోయిన వారి త్యాగం వెలకట్టలేనిది. ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం ఇవ్వాలి. ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం, నష్టం జరగాలని కోరుకోనని అయన అన్నారు. . ఆసియా ఖండంలోనే ఎక్కడా లేని పునరావాస కాలనీలు కట్టాం. మంత్రి హరీశ్రావు డైనమిక్ లీడర్. చురుకైన మంత్రి, ఆయనకు శక్తియుక్తులు ఉన్నాయి. భూమి కోల్పోయినవారికి న్యా కార్యక్రమాలు చేపట్టి, మంజూరు చేయాలి. ఉపాధి కలిపించేలా చర్యలు తీసుకోవాలి అని హరీశ్రావుకు సీఎం కేసీఆర్ సూచించారు.
ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం ముఖ్యమంత్రి కేసీఆర్
బుధవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసారు. తరువాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం అని అయన అన్నారు.
కేసీఆర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం 58వేల మంది కార్మికులు పని చేశారన్నారు. ఆ సమయంలో ఓ దుర్మార్గుడు కోర్టే స్టే తెచ్చాడని మండిపడ్డారు. దాదాపు 610కి పైగా కేసులు వేశారని చెప్పారు. ఇంజినీర్లు కూడా కేసులకు బయపడకుండా పని చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ అతి భారీ జలాశయం మల్లన్న సాగర్ను ప్రారంభించుకోవడం హర్షించుకోదగ్గ ఘట్టం. ఈ మహాయజ్ఞంలో ప్రతి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కాళేశ్వరం ప్రాజెక్టు 58 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇంజినీర్లు పదవీ విరమణ పొందిన కూడా ఈ ప్రాజెక్టు కోసం పని చేశారు. ఇంజినీర్లు అందరికీ సెల్యూట్. ఎండనక, వాననక, రాత్రింబవళ్లు కష్టపడి పని చేశారు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడామని అన్నారు.
గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. గోదావరి జలాలతో అభిషేకం చేయబోతున్నాం. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు ఇదని అన్నారు. మన రాష్ట్ర అభివృద్ధిని చూసి మహారాష్ట్ర సీఎం ఆశ్చర్యపోయారని కేసీఆర్ చెప్పారు.