కడప, ఫిబ్రవరి 23
నెల్లూరు జిల్లా.. ఉదయగిరిలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరై.. తిరిగి విజయవాడకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం కడప విమానాశ్రయంలో జిల్లా నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
బుధవారం ఉదయం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అంత్యక్రియలు ముగిసిన అనంతరం.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ ద్వారా.. మధ్యాహ్నం 12.40 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుండి ప్రత్యేక విమానంలో 12.52 గంటలకు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటుతో పాటు.. ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతి, ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సహాయ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డి వున్నారు.
కడప విమానాశ్రయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు పలికిన వారిలో.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ అన్బు రాజన్ లతో పాటు.. ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, జేసీలు గౌతమి (రెవెన్యూ), సాయికాంత్ వర్మ (అభివృద్ధి) గౌతమి, ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డిఎస్పీ వెంకట శివారెడ్డి తదితరులు ఉన్నారు.