కడప ఫిబ్రవరి 23
వ్యవసాయ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టి ప్రక్షాళన చేయకపోతేయూ తగిన మూల్యం చెల్లించక తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. బుధవారం స్థానిక ఎద్దుల ఈశ్వరరెడ్డి హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు ఎరువులు పురుగు మందుల డీలర్ ల నుండి భారీ ఎత్తున ముడుపులు తీసుకుంటూ ఇవ్వని వారిపై ఒత్తిళ్ళు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపో గా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విచారణ అధికారినీ నియమిస్తే విచారణ అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సమక్షంలోనే డీలర్లను విచారించడం విచారకరమన్నారు. వ్యవసాయ అధికారులు సమయపాలన పాటించకుండా ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాలక ప్రభుత్వాలు ఈ పంట నమోదు ప్రాతిపదికగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు మాత్రం అందుకు తగ్గట్టు నమోదు చేయడం లేదన్నారు రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులను అందుబాటులోకి తెచ్చేందుకు పర్యవేక్షించాల్సిన బాధ్యతను విస్మరించి మామూళ్ల మత్తులో జోగుతున్న రని వారు తీవ్రంగా విమర్శించారు. పంటల సస్యరక్షణ చర్యలపై అవగాహన సదస్సులు, పొలంబడి మొక్కుబడిగా చేపట్టి నిధులు కాజేయడానికి లెక్కలు రాసుకుంటున్నారు అని ఆరోపించారు ఇబ్బడిముబ్బడిగా నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగుమందులు అమ్ముతున్న డీలర్లపై చర్యలు తీసుకోకుండా స్టాక్ రిజిస్టర్ మెయింటెనెన్స్ పరిశీలన పేరుతో వసూళ్లకు పాల్పడుతూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు వైఖరి మార్చుకుని అక్రమాలను అరికట్టి ప్రక్షాళన గావించకపొతే ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ శివ శంకర్ రెడ్డి పి.చంద్రశేఖర్ రెడ్డి మేకల జయన్న తదితరులు పాల్గొన్నారు.