మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. స్వల్ప ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దృష్టి పెట్టిన ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో రోజు మొత్తం పరిమిత స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 35,556 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ యథాతథంగా 10,806 వద్దే స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో ఎన్టీపీసీ(2.27%), డాక్టర్ రెడ్డీస్(1.51%), ఇండస్ ఇండ్ బ్యాంక్(1.07%), ఎస్బీఐఎన్(0.98%), హీరో మోటోకార్ప్(0.94%), పవర్ గ్రిడ్(0.89%) ముందు వరుసలో ఉండగా, మరో వైపు ఎం అండ్ ఎం(2.17%), టాటా మోటార్స్(2.00%), యెస్ బ్యాంక్(1.51%), భారతీ ఎయిర్టెల్(1.09%), అదానీ పోర్ట్స్(0.94%) నష్టాల్లో ముగిశాయి.