YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

2026వ సంవత్సరానికల్లా భారత్‌లో 100 కోట్లకు చేరుకానున్న స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు

2026వ సంవత్సరానికల్లా భారత్‌లో 100 కోట్లకు చేరుకానున్న స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23
భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల సంఖ్య 2026వ సంవత్సరానికల్లా 100 కోట్లకు చేరుతుందని కన్సల్టింగ్‌ సంస్థ డెలాయిట్‌ అంచనా వేసింది. ఇంటర్నెట్‌ ఎనేబుల్డ్‌ ఫోన్ల విక్రయాలు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతుందని ప్రపంచంలో రెండో పెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా భారత్‌ ఆవిర్భవిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు డెలాయిట్‌ పేర్కొంది. 2021లో ఇండియాలో 120 కోట్ల మొబైల్‌ చందాదారులున్నారని, అందులో 75 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లని అధ్యయనం తెలిపింది. డెలాయిట్‌ 2022 గ్లోబల్‌ టీఎంటీ (టెక్నాలజీ, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌) అంచనాలివి.. 2021-26 మధ్య ఐదేండ్లకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ చక్రగతిన 6 శాతం వార్షిక వృద్ధిచెందుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 2.5 శాతంగా ఉంటుంది.ఇంటర్నెట్‌ వినియోగం పెరగనున్నందున, స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ అధికమవుతుంది. ఫిన్‌టెక్‌, ఈ-హెల్త్‌, ఈ-లెర్నింగ్‌ వంటివాటిని అవలంబించాల్సిరావడం ఇందుకు ప్రధాన కారణం.భారత్‌నెట్‌ పథకం కింద 2025కల్లా గ్రామాలన్నింటికీ ఫైబర్‌ వేయాలన్న ప్రభుత్వ ప్రణాళిక కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరుగుతాయి.పట్టణ ప్రాంతాల్లో 2026నాటికి పాత ఫోన్ల స్థానే సెకండ్‌హ్యాండ్‌ ఫోన్లను కొనే బదులు 95 శాతం మంది కొత్త స్మార్ట్‌ఫోన్లనే ఎంపిక చేసుకుంటారు. 5 శాతం మాత్రమే ప్రి-ఓన్డ్‌ ఫోన్లు ఉంటాయి. 2021లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు 75 శాతం కాగా, ప్రి-ఓన్డ్‌ కొనుగోళ్లు 25 శాతంగా ఉంది.
ఒక ఫోన్‌ సగటు జీవితకాలం నాలుగేండ్లుగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సైతం అదే ట్రెండ్‌ ఏర్పడుతుందని అంచనా. ఈ ప్రాంతాల్లో 2026కల్లా 80 శాతం రీప్లేస్‌మెంట్లు కొత్త ఫోన్లద్వారా, 20 శాతం ప్రి-ఓన్డ్‌గా జరుగుతుంది.పట్టణ ప్రాంతాల్లో 2021లో 7.2 కోట్ల ఫీచర్‌ ఫోన్ల రీప్లేస్‌మెంట్స్‌ జరగ్గా, 2026కల్లా ఇది 6 కోట్లకు తగ్గుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 7.1 కోట్ల నుంచి 6 కోట్లకు తగ్గుతుంది.భారత్‌లో 2021లో 30 కోట్ల స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జరగ్గా, 2026కల్లా ఈ అమ్మకాలు 40 కోట్లకు పెరుగుతాయి.5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నందున, స్మార్ట్‌ఫోన్లకు మరింత డిమాండ్‌ ఉంటుంది. 2026నాటికి మొత్తం స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో 80 శాతం (31 కోట్లు) 5జీ ఫోన్లే ఉంటాయి.హైస్పీడ్‌ గేమింగ్‌, రిమోట్‌ హెల్త్‌కేర్‌ వంటి అప్లికేషన్ల కారణంగా 5జీ మొబైల్‌ టెక్నాలజీ శరవేగంగా ప్రజల్లోకి వెళుతుంది.2022-26 మధ్యకాలంలో 250 బిలియన్‌ డాలర్ల (రూ.18.75 లక్షల కోట్లు) విలువైన 170 కోట్ల స్మార్ట్‌ఫోన్లు భారత్‌లోకి దిగుమతవుతాయి. అందులో 84 కోట్లు 5జీ ఫోన్లే ఉంటాయి.సెమికండక్టర్‌ తయారీకి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 10 బిలియన్‌ డాలర్ల ప్రోత్సాహక ప్యాకేజీ ఫలితంగా దేశంలో ఫోన్ల తయారీ పెరుగుతుంది.

Related Posts