న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 23
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఓ నెల క్రితం ఒమిక్రాన్ సోకినా… ఇప్పటికీ తాను బాధపడుతూనే వున్నానని వెల్లడించారు. ‘మొదటి వేవ్ వచ్చిన సందర్భంలో నాకు కరోనా సోకింది. నాలుగు రోజుల్లోనే కోలుకున్నాను. ఒమిక్రాన్ సోకి 25 రోజులు గడుస్తోంది. కానీ.. దాని తదనంతర పరిణామాలతో నేను బాధపడుతూనే వున్నాను. అది సైలెంట్ కిల్‌ుర్ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయిలో భౌతిక విచారణలు ప్రారంభం కావాలని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ సీజేను అభ్యర్థించగా… ఆయన పై విధంగా స్పందించారు.