తిరుపతి, ఫిబ్రవరి 24,
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు నెలల నుంచి లేఅవుట్ స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గత ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు జరపడం లేదు. జిల్లా అధికారుల ఆదేశాల వల్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతుందని నేతలు చెబుతున్నారు. వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లేఅవుట్ స్థలాలకు నాలుగు నెలల నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఈ ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు జరపడం లేదు. జిల్లా అధికారుల ఆదేశాల వల్ల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నా.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రిజిస్ట్రేషన్లు ఆపేశారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గంలో నాలుగు మండలాలతో పాటు కుప్పం మున్సిపాలిటి పరిధిలోని కోట్లలో పెట్టుబడి పెట్టివ వ్యాపారులు.. లేఅవుట్ స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగక తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు.మరోవైపు రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సగానికి తగ్గిపోయిందని అధికారులు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా.. జనవరి నెలాఖరు వరకు 4.80కోట్లు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.మరోవైపు గత నాలుగు నెలల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెంచర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనధికారికంగా నిలిపివేయడం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో కొనుగోలు విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది కాని జిల్లా కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపి వేయడం జరిగిందని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీని వల్ల భూమి అమ్ముకొని తమ పిల్లలకు పెళ్లిళ్లు ,చదువులు చేయడానికి ఎదురు చూస్తున్న చాలామంది కుప్పం వాసులు ఇబ్బందులు పడుతున్నారు.అయితే నియోజకవర్గంలో టీడీపీని దెబ్బ తీయాలంటే నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలకు వెంచర్ లతో సంబంధాలు ఉన్నాయని వాటి రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో ఆర్థికంగా దెబ్బతింటారని అధికార పార్టీ సూచనలతోనే ఇలా చేస్తున్నారనే స్దానిక నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుప్పంలోని సైట్ రిజిస్ట్రేషన్ నిలిపివేయడం చాలా దారుణమని వాపోతున్నారు కుప్పం ప్రజలు