YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీయేతర పార్టీలు..

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీయేతర పార్టీలు..

హైదరాబాద్, ఫిబ్రవరి 24,
2023 కి ముందే దేశంలో మరో ఫ్రంట్ రాబోతోందా? తెలంగాణ దానికి వేదిక కాబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో వున్నారు. వీరందరి సమావేశానికి ముహూర్తం ఖరారైందా ? అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రాంతీయ పార్టీల భేటీ జరిగే అవకాశం ఉందా ? ప్రాంతీయ పార్టీల సమావేశంకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోందా ? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న పార్టీలు ఒక్క తాటిపైకి రావడానికి కసరత్తు మొదలైంది.ఇప్పటికే టీఆర్ఎస్,టీఎంసీ,డీఎంకే,ఎన్సీపీ, శివసేన ,ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కలసి ముందుకు నడిచే దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా త్వరలో ప్రాంతీయ పార్టీలు,బిజెపిని నిలువరించాలని అనుకుంటున్న శక్తుల సమావేశంను సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు.అన్ని ప్రాంతీయ పార్టీలు జట్టుగా బీజేపీపై రాజకీయ పోరాటం కోసం ఎజెండా సిద్ధం చేసే కసరత్తు జరుగుతుంది దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా ఫలితాలు ఉండకపోవచ్చు అని ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల లెక్కలుగా ఉన్నాయి.అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత …ప్రాంతీయ పార్టీల సమావేశం ఉండే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఆశిస్తున్న ఫలితాలు రాకపోతే…ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుపై మరింత వేగం పెంచే అవకాశం ఉంది.మరోవైపు మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో యూపీ ఎన్నికల ప్రచారంకు మమత బెనర్జీ సిద్ధం అయ్యారు. ఆ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రాంతీయ పార్టీలు ఆ వేదికను కలసి పంచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి పార్టీల సమావేశం హైదరాబాద్ లో ఉంటుందా లేక మరొక చోట ఉంటుందా అన్నది మార్చిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర సీఎం ఉథ్దవ్ థాకరే లాంటివారు బీజేపీయేతర ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్నారు. వీరంతా కలిసి ఒక వేదిక ఏర్పాటుచేస్తే వీరితో భావసారూప్యం వున్న పార్టీలు కలిసి వస్తాయేమో చూడాలి.

Related Posts