YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ హమీలను ప్రజలు నమ్మరు

 కాంగ్రెస్ హమీలను ప్రజలు నమ్మరు

గత ఐదు రోజులుగా రైతు బంధు పథకం విజయవంతంగా అమలవుతోంది. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా రాని పాస్ బుక్కులు తమ గుమ్మంలోకే రావడం రైతులకు సంతోషాన్నిస్తోందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రైతు బందు పథకం విజయం కావడం తో కాంగ్రెస్ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు దమ్ముంటే రైతు బంధు పథకాన్ని సూటిగా వ్యతిరేకించాలని అన్నారు. అరవై మంది సీఎం అభ్యర్థులతో కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర చేస్తున్నారు. బస్సు యాత్ర వేదిక నుంచి రైతు బంధు పథకాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటన చేసే దమ్ము కాంగ్రెస్ నేతలకుందా అని ప్రశ్నించారు. .కాంగ్రెస్ నేతలు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు . .ఉత్తమ్ ఉత్త మాటలు మాట్లాడుతూ అధికారం లోకి వస్తామని పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఉత్తమ్ వన్నీ తుపాకి రాముడి మాటలే. .అధికారం లో ఉండి మేనిఫెస్టో లో చెప్పినవి కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ అని అయన విమర్శించారు. .అధికారం లో ఉన్నపుడు రైతాంగం నడ్డి విరిచిన కాంగ్రెస్ పార్టి మరోసారి అధికారమిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని ఉత్తమ్ చెబితే తెలంగాణ ప్రజలు నమ్ముతారా అని అడిగారు. .అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తామన్నట్టు ఉంది కాంగ్రెస్ తీరు అని వ్యాఖ్యానించారు. మద్దతు ధరలు ఎవరు ప్రకటిస్తారో ఉత్తమ్ కు కనీస అవగాహన లేదు. .మద్దతు ధరలు కేంద్రం ఇవ్వకున్నా రాష్ట్రం తన పరిధిలో రైతాంగానికి మేలు చేసేందుకు కెసిఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేసారు. గోబెల్స్ లా కాంగ్రెస్ నేతలు అబద్దాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఎన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేసినా సీఎం కెసిఆర్ సంకల్పాన్ని అకుంఠిత దీక్ష ను మార్చలేరని అన్నారు. అధికారం లో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ రైతును ,కౌలు రైతు ను గాలి కొదిలేసింది. .కౌలు రైతు పై కాంగ్రెస్ ది మొసలి కన్నీరు అని అన్నారు. వర్షాలు పడితే కూడా అది తమ ఘనతే అని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పత్రికా ప్రకటనలు ఇచ్చేవి. .పత్రికలకు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం కొత్త కాదు. .పత్రికా ప్రకటనల పై ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని అయన అన్నారు. 2014 లో కాంగ్రెస్ ను తెలంగాణ ఓటర్లు పాతాళానికి నెట్టారు ..కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పైకి లేచే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ నేతలు పిచ్చి మాటలు మానితే మంచిది. కొత్తగా హామీలిచ్చేముందు కాంగ్రెస్ నేతలు 2009 మేనిఫెస్టో ను అధికారం లో ఉండగా ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఎన్ని హామీలిచ్చినా నమ్మే పరిస్థితులు లేవని అన్నారు. 

Related Posts