YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఖైరతాబాద్ కోసం...కాంగ్రెస్ లో పోరు

ఖైరతాబాద్ కోసం...కాంగ్రెస్ లో పోరు

హైదరాబాద్, ఫిబ్రవరి 24,
అలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు తీరు మారింది. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం.. నేతల లేమీతో సతమతమవుతోంది. మాజీ మంత్రి, దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి హయాంలో ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. మధ్యలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి చెందిన చింతల రామచంద్రారెడ్డి గెలిచినా.. ఆ తర్వా గెలిచిన దానం నాగేందర్.. కాంగ్రెస్ లో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ బలంగా ఉనికి చాటుకుంటూ వచ్చింది. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్‌ను వీడి అధికార గులాబీ పార్టీలో చేరిపోయాక, కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆ తర్వాత వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థి కూడా లేని దుస్థితికి చేరుకుంది. దీంతో రాష్ట్ర నాయకత్వం ఆగమేఘాల మీద నాన్ లోకల్ అభ్యర్థిని బరిలోకి దింపి చతికిలాపడింది.అయితే, 2018 ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమకుమార్ రెడ్డి పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్‌కి టికెట్ ఇచ్చారు. అక్కడ పోటీ చేయడం దాసోజుకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా.. ఆఖరి నిముషంలో టికెట్ దక్కడంతో పోటీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదీ లేక, బీ ఫామ్ తీసుకొని ఖైరతాబాద్‌లో కాలు పెట్టె సమయానికి బలంగా ఉన్న నేతలంతా తలో చోటకు జారుకున్నారు. దాసోజు శ్రవణ్ ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఎలాంటి అవగాహన లేదు. ఎలాగోలా ప్రచారంలో దిగి పోరాటం చేసినప్పటికీ, దానం నాగేందర్ చేతిలో చిత్తు చిత్తుగా ఓటమిపాలయ్యారు. ఆ తరువాత ఆ నిజయోజక వర్గాన్ని దాసోజు అంటిపట్టుకుని ఉన్నప్పటికీ, అక్కడ కనీస స్థాయిలో కూడా బలోపేతం చేయలేకపోయారు.మరోవైపు, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక అదే నియోజకవర్గానికి చెందదిన డాక్టర్ రోహిన్‌రెడ్డి పేరు సడన్‌గా తెర మీదికి వచ్చింది. రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటే రోహిన్ టికెట్ ఈసారి నాదే అంటున్నారు. నిజయోజకవర్గంలో స్థానికుడనైనా నాకు ఎప్పటి నుండో టికెట్ రేసులో ఉన్నా.. కానీ అవకాశం దక్కలేదని చెప్తున్నారు. దానం నాగందర్ పార్టీలో సీనియర్‌గా ఉన్నారు. కాబట్టి అప్పట్లో నాకు టికెట్ దక్కలేదన్నారు. 2018 లో నాకు టికెట్ దక్కాల్సి ఉన్నపటికీ ఉత్తమ్ కుమార్.. సపోర్ట్ చేయకపోవడంతో టికెట్ దక్కలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆశీసులు పుష్కలంగా ఉన్నాయని, అంతేకాకుండా పీసీసీ సన్నిహితుడు కాబట్టి టిక్కెట్ ఈసారి పక్క నాకే అని ప్రచారం చేసుకుంటున్నారు రోహిన్ రెడ్డి.రోహిన్ రెడ్డి ఎంట్రీతో దాసోజు శ్రవణ్ ఇరకాటంలొ పడ్డారు రోహిన్.. ప్రాధాన్యతపై దాసోజు కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరి ఫైట్ ఇలా ఉంటే అదే నిజయోజక వర్గానికి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు సైతం తానూ రేసులో ఉన్నఅంటూ చెప్పుకుంటున్నారు. మహిళ కాంగ్రెస్ కోటలో ఈ సారి ఖైరతాబాద్ టికెట్ తనదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్న ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ టిక్కెట్ లొల్లి మూడు ముక్కలాటను తలపిస్తోంది. ఈ ముగ్గురిలో హై కమండ్ ఛాయిస్ ఎవరనేది వేచి చూడాలి.

Related Posts