హైదరాబాద్
డ్రగ్స్ నిర్ములనపై ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రపంచాన్ని డ్రగ్స్ ప్రస్తుతం కుదిపేస్తుంది.చాలా మంది తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి డ్రగ్స్ కు బానిసలు అయితే చావే శరణ్యం. డ్రగ్స్ ఉపయోగించడం వలన కుటుంబాలు రోడ్డు మీద పడుతాయి.తప్పు చేసి జైలు కు వెళ్లడం ఎందుకు అసలు తప్పే చేయకుండా ఉంటే బావుంటుంది. చాలా నేరాలను క్షణాల్లో పట్టుకునే సత్తా తెలంగాణ పోలీసులకే ఉంది. కార్పోరేట్ ఆఫీసులకు ధీటుగా పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ఉన్నాయి. సమాజంలో ఉన్న డ్రగ్స్ మాఫియా నిర్ములించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఇటీవల అరెస్ట్ అయిన వ్యాపారులకు ఇది అవసరమా. ప్రతి ఒక్కరికి డ్రగ్స్ పై అవగాహన కల్పించాలి. హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీసే డ్రగ్స్ ను ప్రతి ఒక్కరం నిర్ములిద్దాం. డ్రగ్స్ లో పట్టుబడితే పోలీసులు ఎవ్వరిని వదిలి పెట్టరని హెచ్చరించారు.
హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. హైదరాబాద్ పోలీస్ రెండు వింగ్స్ ను ఏర్పాటు చేసాం. నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్, ద్వారా డ్రగ్స్ ముఠాలపై చెక్ పెడుతున్నాం. నైజీరియా నుండి హైదరాబాద్ కు ఎక్కువగా డ్రగ్స్ వస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు డ్రగ్స్ పై జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని కోరుతున్నాం. డ్రగ్స్ నిర్ములనకు పోలీసులకు ప్రతి ఒక్కరు సహకరించాలి. ముంబై గోవా నుంచి ఇలాంటి వస్తున్నాయి. వైజాగ్, చతిస్గడ్ ప్రాంతాల నుంచి గంజాయి ఎక్కువగా వస్తుంది వాటిని నిర్మించడానికి కొత్త వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారిగా హైదరాబాద్ నగరంలో బిజినెస్ చేస్తూ డ్రగ్స్ ఉపయోగిస్తున్న వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. సరఫరా చేసే వారే కాకుండా వినియోగించే వారి పైన కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.