విజయవాడ
టిటిడి బోర్డు చైర్మన్ నిర్ణయాలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గురువారం స్పందించారు. హిందుత్వం అంటే వ్యాపారం కాదని అయన అన్నారు. దేవాలయాలను ఆదాయాన్ని కుమ్మరించే వాటిగా చూస్తున్నారు. క్రిస్టియానిటీ, మైనారిటీ అంటే మీకు ఓటు బ్యాంకు గా ఉన్నాయి. సేవా టికెట్ రేట్లు పెంచడంపై పునరాలోచన చేయాలని అయన అన్నారు. బడ్జెట్లో హిందుత్వానికి నిధులు పెంచాలి. బోర్డు పరిపాలన ధర్మ బద్దంగా ఉండాలి. దేవాలయాలు నిర్మాణానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదు. బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలు పరిపాలన ప్రజల చేతుల్లో ఉంటుంది. హిందూ ధర్మం పట్ల మీ వైఖరి అనుమానించే రీతిలో ఉందని అయన వ్యాఖ్యానించారు.