YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు కంప్లీట్ ఫ్యామిలీ సినిమా - న‌టి కుష్బూ.

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు కంప్లీట్ ఫ్యామిలీ సినిమా - న‌టి కుష్బూ.

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రాధిక శరత్ కుమార్, కుష్బూ, ఊర్వశీ  వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్ న‌టిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం విడుద‌ల‌కానుంది.  ఈ సంద‌ర్భంగా న‌టి కుష్బూ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...
డైరెక్ట‌ర్ ఈ క‌థ చెప్తున్న‌ప్పుడే రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది. ఎందుకంటే కేవ‌లం ఆడ‌వాళ్ల‌కు అనే కాదు హ్యూమ‌న్ ఎమోష‌న్స్‌కి ప్రాముఖ్య‌త ఇస్తూ ఈ క‌థ రాశారు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోష‌న్స్ అన్నీ చ‌క్క‌గా కుదిరాయి.  కేవ‌లం ఎమోష‌న్స్ మాత్ర‌మే కాదు ఈ కాన్సెప్ట్ చాలా హిలేరియ‌స్‌గా కూడా ఉంటుంది.  ఆడ‌వాళ్లు అంటే ఎక్కువ‌గా గ్లిజ‌రిన్‌తోనే పని ఉంటుంది అనుకుంటారు. ఈ సినిమాలో ఈ భావ‌న త‌ప్పు అని తెలుస్తుంది. వారు ఎందుకు హ్యాపీగా ఉండ‌కూడ‌దు అనే కోణం నుండి ఈ క‌థ రాశాడు. ఈ సినిమాలో నా పాత్ర ఎలా ఉంది అనేది సినిమా చూసిన త‌ర్వాత ఆడియ‌న్స్ చెప్పాలి. ఎందుకుంటే ఈ క్యారెక్ట‌ర్ చేస్తున్న‌ప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. రేపు స్క్రీన్ మీద చూస్తున్న‌ప్పుడు ఆడియ‌న్స్ కూడా ఎంజాయ్ చేస్తే చాలు. రాధిక గారు, ఊర్శ‌శి గారు ఇద్ద‌రూ నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్స్‌. వాళ్లు గ్రేట్ యాక్ట‌ర్స్ ..వారితో క‌లిసి పనిచేయ‌డం చాలా క‌ష్టం. కిషోర్ గారు సెట్‌లో ఎప్పుడూ టెన్ష‌న్ అవ‌డం నేను చూడ‌లేదు. కూల్‌గా అన్ని ప‌నులు ద‌గ్గ‌రుండి చూసుకునేవారు. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం ఏ ఆర్టిస్టుకైనా చాలా కంఫ‌ర్ట్‌గా ఉంటుంది. శ‌ర్వానంద్, ర‌ష్మిక ఇద్ద‌రు వెరీ ప్రొఫెష‌న‌ల్ యాక్ట‌ర్స్‌. ఇద్ద‌రికీ కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ చాలా ఎక్కువ‌. అది పాయింట్...ద‌ర్శ‌కుడికి ఏం కావాలో క‌చ్చితంగా తెలుసు. శ‌ర్వా అయితే ఒక కుటుంబ‌స‌భ్యుడిలానే అంద‌ర్నీ బాగా చూసుకునేవాడు. నిర్మాత‌లు కూడా చాలా స‌పోర్ట్ చేశారు. ఈ క‌థ ఎక్కువ‌గా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి క‌నెక్ట్ అవుతుంది. త‌ప్ప‌కుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ కుంటుంబ స‌భ్యుల‌తో వ‌చ్చి చూసే చిత్ర‌మిది. ముఖ్యంగా ఆడ‌వాళ్లు అంద‌రూ చూడాల్సిన చిత్రం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ సినిమా..
ప్ర‌స్తుతం  తెలుగులో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌లు వింటున్నాను. ఛాలెంజింగ్ గా అనిపించే పాత్ర‌లు చేయాలి అనుకుంటున్నాను. కొత్త ద‌ర్శ‌కులు స‌రికొత్త ఆలోచ‌న‌లతో వ‌స్తున్నారు. ద‌ర్శ‌కుడు క్రొత్త‌, పాత అనే దానికంటే ఒక సినిమా స్క్రిప్ట్ ముఖ్యం. స్క్రిప్ట్ న‌చ్చితే కొత్త‌వారితో సినిమా చేయ‌డానికి ఎప్పుడైనా సిద్ద‌మే..

Related Posts