హైదరాబాద్, ఫిబ్రవరి 25,
పవన్‌పై కక్ష సాధింపు ద్వారా సాధించేది ఏంటి?.. ఏ సినిమా తీసినా ఆయన రెమ్యూనరేషన్ ఆయనకొస్తుంది.. సీఎం జగన్ తీసుకున్న చర్యల వల్ల పవన్‌కు వచ్చిన నష్టమేమీ లేదు.. ఏదైనా ఉంటే నేరుగా తేల్చుకోండి.. జగన్‌కేనా ఇగో ఉండేది? ఇగో.. అందరికీ ఉంటుంది.. ప్రతి ఒక్కరికి ఇగో ఉంటుంది.. స్వతంత్రంగా కష్టపడి పైకి వచ్చిన పవన్ కల్యాణ్ లాంటి వారికి ఇంకా ఎక్కవగానే ఉంటుంది.. అయితే అన్ని సందర్భాల్లో ఇది పని చేయదు.. వీలుంటే మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలి.. సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు ఆపాలి.."
"ఏ ఒక్క డైరెక్టర్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి షూటింగ్ చేయరు.. చిరంజీవి గారిని చూస్తే ఏడుపొచ్చింది.. కింది స్థాయి నుంచి స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి ఆయన. దీనాతి దీనంగా చేతులు జోడించి జగన్‌ను అడిగారు.. ఆ పరిస్థితి ఎవరికీ రావొద్దు.. చిరంజీవి సైతం మిమ్మల్ని చేతులు జోడించి ప్రాథేయపడాలా? ఆయనకు ఏం తక్కువ? చేతులు జోడించి అడిగారంటే ఆయన బతుకుదెరువు కోసం కాదు.. ఆయన్ను పైకి తెచ్చిన సినిమా ఇండస్ట్రీ కోసం అడిగారు.. సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధిస్తే థియేటర్ వద్ద పల్లీలు అమ్మే వ్యక్తి నుంచి లైట్ బాయ్ వరకు అందరూ నాశనమైపోతారు.." తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.. కక్ష సాధింపు చర్యల వల్ల ఏపీలో సినీ పరిశ్రమకు మనుగడ లేకుండా పోతుంది.. అంతేకానీ సినీ నటులకు ఎలాంటి నష్టం ఉండదు.. ఎమ్మార్వోలు, పోలీసులు అంతా కలిసి సినిమా థియేటర్లపై పడ్డారు.. లా అండ్ ఆర్డర్‌ను పోలీసులు మర్చిపోయారు.." జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రివ్యూ కార్యక్రమంలో స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.. తెలంగాణలోని సదుపాయాలను సినిమా వాళ్లు వినియోగించుకోవాలని కేటీఆర్ కోరారు.. కేటీఆర్ హాజరవడంతో పవన్ కల్యాణ్‌కి ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చింది.. సినీ పరిశ్రమను నాశనం చేయొద్దు.. ఇది ఏపీ మనుగడకు మంచిది కాదు.. ఏదైనా ఉంటే ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలి.. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటికైనా సీఎం జగన్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలి.. సీబీఐ అధికారుల మీద కూడా కేసులు పెడుతున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ ఉండకూడదా?.. నిన్ను ఎవరూ క్షమించడంలా."ఇదంతా ప్రజలు చర్చించుకుంటున్న విషయాలు కాదు... తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు.