విశాఖపట్నం
ఏపీ విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. బీచ్ రోడ్లో అన్ని ప్రధాన దర్శనీయ స్థలాలను చూపరులకు కనువిందు చేసేట్టుగా తీర్చిదిద్దుతున్నారు. ఈనెల 27న జరిగే అంతర్జాతీయ సిటీ పరేడ్, నౌకా దళ విన్యాసాల కోసం సిద్దమవు తున్న ఈ ఏర్పాట్లు కొత్త సొబగులను అద్దు తోంది.ఈనెల 27న జరుగనున్న బహు ళ దేశాల నేవీ విన్యాసం-మిలన్ 2022 కోసం విశాఖ బీచ్ రోడ్ కొత్త రూపు దిద్దుకుంటోంది. సముద్రంపై జరిగే విన్యాసాలు బీచ్ రోడ్లో జరిగే పరేడ్ ను వీక్షించేందుకు వచ్చే వారికి ఈ ప్రాంతమంతా సరికొత్తగా కన్పించ నుంది. టీయూ-142 మ్యూజియం, కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం, విక్టరీ ఎట్ సీ వంటివే కాకుండా సాగర తీరంలో ప్రతి ఒక్క విగ్రహాన్ని శుభ్రం చేసి అ ప్రాంతమంతా రంగులు అద్ది.. అందంగా తీర్చిదిద్దారు.రెండు దశల్లో నౌకా దళాల విన్యాసం జరుగుతుంది.
బహుళ దేశాల నౌకాదళాల విన్యాసం మిలన్ 2022 రెండు దశలలో జరుగు తుంది. తొలిదశలో నౌకాదళ స్థావరం, ఆర్కే బీచ్లో నిర్వహించనున్నారు. ఈనెల 26న అంతర్జాతీయ నౌకా సదస్సుతో ఆరంభమయ్యే మిలన్కి.. 40కి పైగా దేశాల నుంచి నౌకాదళ ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. 27న ఆర్కే బీచ్లో వివిధ నేవీలకు చెందిన బృందాలు పరేడ్ నిర్వహిస్తా యి. ఇందులో భాగంగానే సముద్రంపై నా, గగన తలంలోనూ యుద్ధ విమా నాలు, హెలికాఫ్టర్లు విన్యాసాలు చేయనున్నాయి.