YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఉక్రేయిన బాధతులకు హెల్ప్ లైన్ సీఎస్ సోమేష్ కుమార్

ఉక్రేయిన బాధతులకు హెల్ప్ లైన్ సీఎస్ సోమేష్ కుమార్

హైదరాబాద్
ఉక్రేయిన్ లో చిక్కుకుపోయిన వారికి సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్ సచివాలయంలో హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసారు. ఈ నేపధ్యంలో చీఫ్ సెక్రటరి సోమేష్ కుమార్ శుక్రవారం నాడు సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు 75 కాల్స్ వచ్చాయని సీఎస్ వెల్లడించారు.  తెలంగాణ వాసుల  సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతుందని అయన అన్నారు.  బాధితులందరిని స్వదేశం చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని అయన అన్నారు

ఉక్రేయిన్ లో నలుగురు రాయదుర్గం విద్యార్దులు
ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసించడం కోసం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుండి వెళ్లిన నలుగురు విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న తమ పిల్లలను ఇండియాకు రప్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల్లో రాయదుర్గం పట్టణానికి చెందిన సాయి గణేష్, అజిత్ రెడ్డి, ఆముక్త ,కనేకల్ మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన తిప్పేస్వామి ఉన్నారు. యుద్ధవాతావరణం లో చిక్కుకున్న విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని వీడియో కాల్ ద్వారా విద్యార్థులు తెలియజేశారు. ఇప్పటివరకు  వారు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

Related Posts