అనంతపురం
అనంతపురం జిల్లా గోరంట్లలో భీమ్లా నాయక్ సినిమా టికెట్ వెల 5 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనగా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు థియేటర్ యాజమాన్యాలు నష్టపోకుండా మా వంతుగా 500 రూపాయలు ఇస్తాం థియేటర్లను కాపాడుకుంటాం అంటూ గోరంట్ల చంద్రశేఖర్ థియేటర్ వద్ద జనసేన ఆధ్వర్యంలో విరాళాల సేకరణ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన అభిమానులు. ఈ సందర్భంగా గా జనసేన జిల్లా కార్యదర్శి సురేష్ జనసేన నాయకులు వెంకటేశ్ మాట్లాడుతూ అయ్యా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీరు ప్రజల కోసమే పని చేస్తామని ప్రజల సంక్షేమమే మా లక్ష్యం అని మాది ప్రజా ప్రభుత్వమని అనేకసార్లు చెబుతున్నారు కానీ నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి సిమెంటు ధర 500 కు చేరింది. సిమెంట్ కొనలేక నిరుపేద కుటుంబాల వాళ్ళు ఇల్లు నిర్మించుకో లేక ఆపేశారని దానిపై దయలేని మీరు ఇలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించుకోవాలని. అందులోనూ మీ భారతి సిమెంట్ రేటు కూడా పెంచారు. అందువలన మీరు ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి అయితే సినిమా టికెట్ల ధర తగ్గించిన విధంగా భారతి సిమెంట్ ధరలు తగ్గించి ప్రజలు సులభంగా ఇల్లు నిర్మించుకునేందుకు తక్కువ రేటుకే భారతి సిమెంట్ అందించి ఆదుకోవాలని కోరారు.