తిరుమలలో రద్దీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అంచనాలకు మించి ఉంటోంది. ఇక పండగలు,సెలువులు వస్తే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగ్గట్లుగా వాహనాల సంఖ్యా పెరగడంతో స్థానికంగా కాలుష్యం పెరుగుతోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాప్ రైలు అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. ఈ రైలు సౌకర్యం వస్తే వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలకు శ్రమ తప్పుతుంది. అయితే ఈ రైలు ఏర్పాటు సాధ్యం కాదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలిపిరి నుంచి కొండ వరకు ఈరైలు ప్రవేశపెటాలని గతంలో అధికారులు ప్రతిపాదించారు. కేంద్రానికి ప్రతిపాదన కూడా పంపారు. కేంద్ర ప్రభుత్వం తరపున నిపుణులు సర్వే కూడా చేసి రైలు ప్రవేశపెట్టడం కొంత కష్టమని అన్నారు. అయినప్పటికీ భక్తుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రైలు ఏర్పాటుకే అధికారులు మొగ్గుచూపారు. రైలు ఏర్పాటుపై అధికార్లు ఆలయ పండితులను సలహాలు కోరితే.. ఆగమశాస్త్రం నియమాలకు ఇది విరుద్దమని తెలిపారు. దీంతో కొండకు ట్రామ్స్ రైళ్లు ప్రతిపాదన పక్కకు పెట్టారు. ఈఏడాది తుడా నూతన మాస్టర్‌ప్లాన్ రూపకల్పన చేసే సమయంలో తెరపైకి ట్రామ్స్ రైళు ప్రతిపాదన వచ్చింది. కొండకు వచ్చే భక్తులకు సులువుగా వెళ్లడం కాకుండ, నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరానికి కొంత ఉపయోగపడుతుందని అధికార్లు బావించారు. తుడా అధికార్లు టిటిడితో మరోసారి ట్రామ్స్ రైలు గురించి చర్చించడం జరిగింది. టిటిడి దీనిపై ఆసక్తిచూపలేదని సమాచారం.
తిరుపతిలో ట్రాఫిక్ విపరీతంగా ఉంటోంది. వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో తరచూ ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. ఇక శ్రీవారి సన్నిధికి వచ్చేందుకు భక్తులకు అప్పుడప్పుడూ సమస్యలు ఎదురవుతున్నాయి. రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడం, ఉన్నపుట్‌పాత్‌లు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు, యాత్రికులు నడించి ప్రయాణం చేయడం నరకయాతనంగా ఉంటుంది. ట్రాఫిక్‌సమస్య పరిష్కరానికి ట్రామ్స్ రైలు ప్రవేశ పెట్టాలని నాటి కమిషనర్ వినరుచంద్ ప్రతిపాదన చేశారు. ఆర్‌టిసి బస్టాండు నుంచి అలిపిరి అక్కడ నుంచి రుయా, ఎస్వీయూ, తిరుచానూరు వరకు ప్రతిపాదన చేశారు. ట్రామ్స్‌రైలు కొండకు అవసరం లేదని తిరుపతి నగరానికి ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు సూచించారు. దీనికి స్థలంతో పాటు ఖర్చు తక్కువని పేర్కొన్నడనం జరిగింది. స్మార్టుసిటిలో పీపీపీ పద్దతి ద్వారా ట్రామ్స్‌రైలు ప్రవేశపెట్టాలని బావించారు. తరువాత ఆ ప్రతిపాదన కూడా పక్కన పెట్టేశారు. దీంతో తిరుపతిలో ట్రామ్స్ రైలు ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేనట్లు సమాచారం.