YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ బీజేపీలో ప్రాంతీయ ముఠాలు

ఏపీ బీజేపీలో ప్రాంతీయ ముఠాలు

విజయవాడ, ఫిబ్రవరి 26,
ఆంధ్రప్రదేశ్’లో బీజేపీ ఉందంటే వుంది, లేదంటే లేదు. అయినా, రాష్ట్ర పార్టీలో తగవులు, అంతర్గత విబేధాలకు కొదవ లేదు. చిత్రంగా, దేశంలో మరెక్కడా లేని విధంగా, ఏపీలో  కమల దళంలో రెండు వర్గాలు రెండు ప్రాతీయ పార్టీలు కొమ్ము కస్తున్నాయన్న ఆరోపణలు  ఉన్నాయి. ఒక వర్గం వైసీపీ అనుకూల వర్గం అయితే మరో వర్గం టీడీపీ అనుకూల వర్గంగా ముద్ర పడిపోయింది. అందుకే, బీజేపీకి రాష్టంలో సొంత అస్తిత్వం అనేది లేకుండా పోయిందని, కమలదళం పాత తరం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉంటే, కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు, కేంద్ర బడ్జెట్’లో రాష్ట్రానికి వనగూడిన ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు, రాష్ట్రంలో, ‘బడ్జెట్ పే చర్చ’ పేరిట సదస్సులు నిర్వహిస్తున్నారు. అయితే చిత్రం ఏమంటే, ఇక్కడ కూడా రెండు వర్గాలు పరస్పర విరుద్ధంగా, సొంత పార్టీ, కేంద్ర ప్రభుత్వ స్టాండ్’ను కాకుండా, తమ ‘అభిమాన’ ప్రాంతీయ పార్టీల వాణినే వినిపిస్తున్నారని, పార్టీలోని మూడో వర్గం ఆరోపిస్తోంది. కాగా, ‘బడ్జెట్ పే చర్చ’ లో భాగంగా విజయవాడ’లో జరిగిన సదస్సులో. ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వమాజీ ప్రధాన కార్యదర్శి, ఐవైఆర్ కృష్ణారావు జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న దివాలాకోరు ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీల పేరిట రాష్ట్రాని దివాలా తీయించారని, ఘాటైన విమర్శలు చేశారు.అలాగే, బడ్జెట్ ఎలా రూపొందించాలో కేంద్ర బడ్జెట్‌ను చూడాలని.. ఎలా రూపొందించకూడదో తెలుసుకోవాలంటే.. ఏపీ బడ్జెట్‌ను చూడాలని వ్యంగ్యంగానూ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 37 వేల కోట్లు అప్పుగా ప్రతిపాదించిందని కానీ ఇప్పటికే రూ. 57 వేల కోట్లు అప్పుగా తెచ్చి ఒక్క బటన్‌ నొక్కి పంచేశారని విమర్శించారు. ఆదాయాలు చూసుకోకుండా డబ్బు ఖర్చు పెట్టిన వాళ్లు బాగుపడినట్లు చరిత్ర్రలో ఎక్కడా లేదని అది వ్యక్తి అయినా, సంస్థ అయినా, ప్రభుత్వం అయినా ఇదే జరుగుతుందని తేల్చి చెప్పారు. జగన్‌ తన సొంత డబ్బు తెచ్చి పంచడం లేదని భారం మొత్తం ఏపీ ప్రజలు మోయాల్సిందేనన్నారు. అయితే, అదే వేదిక నుంచి, పార్టీ రాష్ర్ల అధ్యక్షుడు సోము వీర్రాజు సహా, వైసీపీ అనుకూల వర్గంగా ముద్ర పడిన నాయకులు, బడ్జెట్’ ను చిత్తు కాగితంలా చుట్టి, జగన్ రెడ్డి ప్రభుత్వం   బడ్జెట్‌ అనుమతి(ప్రొవిజన్‌) లేకుండానే రూ.94,399.04 కోట్లు ఖర్చు చేసిందని, నిన్న గాక మొన్న కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పు పట్టిన విషయాన్ని పక్కన పెట్టి, గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో  జరిగిన అవకతవకల గురించి మాట్లాడారు. అయితే, బీజేపీ రాష్ట్ర పార్టీలో రెండు, ‘ప్రాంతీయ’ వర్గాలు ఉండడమే కాదు, జాతీయ పార్టీ కూడా ద్వంద వైఖరినే అవలంబిస్తోంది. ఓ వంక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా దశకు చేరుకుందని, ఆర్థిక అత్యవసర పరిస్థితి అనివార్యమయ్యే పరిస్థితి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా అనేక మంది బీజేపీ జాతీయ నాయకులు ఆరోపిస్తున్నారు. మరో వంక, కొత్త అప్పులకు తలుపులు తెరుస్తూ అనుమతులు ఇస్తున్నారు. జాతీయ పార్టీ, అందునా కేంద్రంలో అధికారంలో ఏపీ విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరించ లేక పోతోంది, జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్ర పురోగతిని వెనక్కి నడిపిస్తున్నా, ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది, అనేది వేయి డాలర్ల ప్రశ్న అంటున్నారు పరిశీలకులు. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వ తప్పులను ఉపేక్షిస్తోందని రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. ముఖ్యంగా జూన్’లో జరిగే రాష్ట్ర పార్టీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే, కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని, అంటున్నారు. అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం, ఏపీ విషయంలో, ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం వలన రాష్ట్రం కోలుకోలేనంతగా నష్ట పోతోందని విజ్ఞులు, విమర్శకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.

Related Posts