YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమ్మో... ఇవేం రేట్లు

అమ్మో... ఇవేం రేట్లు

తిరుమల, ఫిబ్రవరి 26,
తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైయున్నారు. శ్రీవారికి భక్తులు విశ్వ వ్యాప్తంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు సప్త సముద్రాలు దాటుకుని మరీ తిరుమలకు వస్తారు ఆయన భక్తులు. ఆ క్రమంలో శ్రీవారి దర్శనం కోసం వారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ సంగతి శేష శైల వాసుడికి తెలుసన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఏడుకొండలవాడిని దర్శించుకుని ప్రపంచంలోని భక్తులంతా తన్మయత్వంతో ఊగిపోతోంటే.. జగనన్న సర్కార్ మాత్రం ఆ దేవదేవుడిని వట్టి వడ్డీ కాసుల వాడుగా కొలుస్తోంది. అంతేకాదు.. ఆ నామాల దేవరను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు పంగనామాలు పెట్టేందుకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి రంగం సిద్ధం చేసింది. ఆ క్రమంలో తాజాగా టీటీడీ ధార్మిక మండలి చైర్మన్, సీఎం వైయస్ జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి టీటీడీ పాలక మండలి సమావేశంలో చేసిన వ్యాఖ్యలు.. శ్రీవారి భక్తలను తీవ్ర మనో వేదనను కలిగిస్తున్నాయి. ఆ క్రమంలో సుప్రభాతం మొదలు అభిషేకం వరకు అన్ని సేవల టికెట్ల ధరలను నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచాలన్న ప్రతిపాదనను టీటీడీ బోర్డు సభ్యులు ఆమోదించారు.  భక్తునికీ, భగవంతుని అనుసంధానంగా నిలిచి.. హిందూ ధర్మాన్ని దేవాలయం ముందు ధ్వజస్థంభంలా నిలబెట్టాల్సిన టీటీడీ పాలక మండలి అందుకు విరుద్ధంగా వ్యహరిస్తూ.. పలు విమర్శల పాలవుతోంది. ఈ పాలక మండలి.. గోవిందుడి సేవలో కంటే జగనన్న సర్కార్ వారి సేవలో తరించి... మరీ పునీతమవుతోంది. తిరుమల వెంకన్నను కామధేనువుగా.. తిరుమల కొండను కల్పతరువుగా చూస్తోందీ పాలక మండలి. ఆ క్రమంలో స్వామివారి భక్తులను దోచుకుని.. ప్రభుత్వంలోని పెద్ద ప్రభువులకు ముడుపులు కట్టీ మరీ సమర్పించేందుకు ఈ పాలక మండలి సమాయత్తమైందీ. తాజాగా శ్రీ వెంకటేశ్వర వారి సేవా టికెట్ల రేట్లను, ఇష్టారాజ్యంగా పెంచేసిందీ టీటీడీ. ప్రస్తుతం సాధారణ టికెట్ 120 రూపాయిలు ఉంది... అలాగే సిఫార్స్ 240 రూపాయిలు ఉంది.. దీనిని 2 వేలు రూపాయిలకు పెంచింది.  అలాగే సాధారణ తోమాల సేవ ధర 220 రూపాయిలు, సిఫార్స్ ధర 440 ఉండగా.. వాటిని 5 వేల రూపాయిలకు పెంచింది. ఇక కళ్యాణోత్సవం టికెట్ ధర వెయ్యి రూపాయిలు ఉండగా..దానిని రెండు వేల అయిదు వందల (2500)కు పెంచింది. ఇక వేదాశీర్వచనం ధర 3 వేల రూపాయాలు ఉంటే.. ఆ ధరను 10 వేల 5 వందల (10500)కు పెంచింది. అలాగే శ్రీవాణి సేవ టికెట్ ధర 10500కు పెంచింది. అలాగే వస్త్రాలంకరణ సేవ టికెట్ ధరను 50 వేల నుంచి లక్షకు పెంచింది.  ఇక ఉదయాస్తమాన సేవ ధరను కోటిన్నర రూపాయలకు తీసుకు పోయిందీ టీటీడీ. ఈ ధరలు చూసి.. సామాన్య భక్తుడు నివ్వెరపోతున్నాడు... ఈ జగన్ ప్రభుత్వ తీరు చూస్తుంటే.. అందరి వాడైన ఈ గోవిందుడు.. కొందరి వాడుగా చేసేందుకు కంకణం కట్టుకోందని సగటు భక్తుడు వాపోతున్నాడు. ఏడుకొండల వాడి మహిమలేమో కానీ.. జగనన్న సర్కారీ మహిమలు మాత్రం ఇంతింత కాదయ్యే అనే పరిస్థితి దాపురించిందని స్వామి వారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. తిరుమల కొండపై హోటళ్లు మూసివేయాలంటూ టీటీడీ తాజా నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు తగ్గించి.. శ్రీవారి సేవా టికెట్ల ధరలు పెంచడం పట్ల.. సోషల్ మీడియా సాక్షిగా జగన్ ప్రభుత్వంపై నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. పూర్వ కాలం గజదొంగలు, దోపిడి దారులంతా అడువుల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండి.. ఒకరిని లేదా పది మందిని మహా అయితే వంద మందినీ దోచుకునేవారని.. కానీ వారంతా ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి.. ప్రజలతో మమేకమైపోయి... పదవు పొంది.. ఇలా ప్రజలను  దోచుకు తింటున్నారనే కామెంట్స్ సైతం నెటిజన్లు పెడుతున్నారు. మరోవైపు.. టీటీడీ పాలక మండలి సమావేశంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే స్వయంగా స్వామి వారి సేవల టికెట్ల ధరలు రేట్లు పెంచండంటూ కామెంట్స్ చేయడంపై అయితే.. తిరుమలను చేపల మార్కెట్ చేసేశారంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టి సోషల్ మీడియా సాక్షిగా ట్రోల్ చేయడం గమనార్హం.

Related Posts