ఏలూరు
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రామేశ్వర స్వామి వారిని పురస్కరించుకుని మహాశివరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ మేనేజర్ రామ చంద్రకుమార్ తెలిపారు.ఆలయ ట్రస్టుబోర్డు సమావేశం ఆలయ ప్రాంగణంలో వైట్ల కిషోర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా చేపట్టబోయే ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు వసతి అన్ని సౌకర్యాలు తీసుకున్నామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామి వారిని దర్శించు కునేందుకు అవసరమైన మేర క్యూలైన్ల ఏర్పాటు చేశామని , అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో యాత్రికులకు ఉచిత భోజనాలతో పాటు చిన్నపిల్లలకు పాలు ,వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ రాము, వైట్ల కిషోర్ లు మాట్లాడుతూ కాగా 27వ తేదీ ఆదివారం గ్రామోత్సవం ,ఊరేగింపు జరుగుతుంది. 28న స్వామివారికి కల్యాణం ,1 వ తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి రధోత్సవం ఉంటుంది. 2 వ తేదీన స్వామి వారికి త్రిసూలోత్సవం, పుష్పోత్సవం మహిళలకు కుంకుమ బరిణలు పంచి పెడతారు. అనంతరం రాత్రి జరిగే ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయని అర్చకులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది భక్తులు పాల్గొంటారని కావున భక్తులంతా విచ్చేసి స్వామి వారి ఆశీస్సులు పొంది సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నెక్కంటి రామలింగేశ్వర రావు ,ఆలయ మేనేజర్ రామ చంద్రకుమార్ ,వైసీపీ నాయకులు వైట్ల కిషోర్ , సర్పంచ్ కోట సరోజిని వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.