న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 26
రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదినలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాతో శాంతి చర్చలు నిర్వహించేందుకు జెలెన్‌స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ సెర్గే నికిఫరోవ్ తెలిపారు. కాల్పుల విరమణకు కూడా జెలెన్‌స్కీ ఆమోదం తెలిపినట్లు సెర్గే చెప్పారు. చర్చలను తిరస్కరించినట్లు వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని, శాంతి, కాల్పుల విరమరణ ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉందని, ఇదే మా శాశ్వత సిద్ధాంతమని, రష్యా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనలను తాము అంగీకరిస్తున్నామని తన ఫేస్‌బుక్ పేజీలో సెర్గే తెలిపారు. అయితే శాంతి చర్చలకు సంబంధించిన స్థలం, తేదీ గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు నికోఫరోవ్ తెలిపారు. చర్చలు ఎంత వేగంగా జరిగితే, అంత త్వరగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఆయన అన్నారు. మిన్‌స్క్‌లో చర్చలు నిర్వహించాలని రష్యా భావించగా.. వార్సాలో జరిగే బాగుంటుందని ఉక్రెయిన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.