YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ వెంట వచ్చేదెవరు..?

జగన్ వెంట వచ్చేదెవరు..?

పశ్చిమగోదావరి జిల్లాలో నుంచి పాదయాత్ర సందర్భంగా పెద్ద తలకాయల చేరికలపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నేతలు ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పార్టీకి తిరుగులేదని విస్తృత ప్రచారానికి దిగారు. క్షేత్రస్థాయి వరకు జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఈ ప్రచారాన్ని మరింత పెంచాలని భావిస్తున్నారు. వాస్తవానికి వైసీపీలో చేరేందుకు ఒకరిద్దరు నేతలు ఇప్పటికే రాయబారాల్లో నిమగ్నమైనట్టు చెబుతున్నారు. అంతకు మించి ముఖ్యనేతలు ఎవరూ వైసీపీ వైపు తొంగి చూసేందుకు సిద్ధపడడం లేదు. కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. వీరందరినీ కూడగట్టుకునే బాధ్యతను స్థానిక నాయకత్వానికే వైసీపీ అప్పగించింది. వాస్తవానికి జగన్‌ నెల రోజు లపాటు జిల్లాలో పోలవరం, చింతలపూడి మినహాయించి మిగిలిన 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు.

 

వీటన్నింటిలోనూ సాధ్యమైనంత వీలుగా తెలుగుదేశం నుంచి చేరికలు ఉండేలా జాగ్రత్తపడాలని నాయకత్వం భావించేది. ఈసారి అలాకాకుండా ఒక మాదిరి పేరొం దిన ప్రముఖ నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకోవా లని, ఈ విషయంలో ఎటువంటి మార్పులు లేవని ఈ మధ్యనే స్పష్టం చేశారు. ఒకటికి రెండుసార్లు మరీ తేల్చి చెప్పారు. పాదయాత్రలో పోలవరం, చింతలపూడి నియో జకవర్గాలు చేర్చకపోవడాన్ని అక్కడి నాయకత్వం వ్యతిరేకి స్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉన్న వైశాల్యం దృష్ట్యా ఏకబిగిన పాదయాత్ర సాధ్యం కాదని నాయకత్వం అక్కడి వారికి తెలిపింది. చింతలపూడి నియోజకవర్గంలో కొం దరు నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంత కుముందు భావించినా వారిలో ఒకరిద్దరు మాత్రం ‘ఎన్నికల పెట్టుబడి’ తమకు సాధ్యం కాదని వెనక్కి తప్పుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో చేసేది లేక, మరోపక్క నియోజక వర్గంలో రూటు మ్యాప్‌ కుదరకపోవడమే కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు.

 

తెలుగుదేశం నాయకత్వం మాత్రం ఈ విషయంలో పట్టుదలగా ఉంది. ఏ ఒక్క నాయకుడిని పార్టీ నుంచి కోల్పోవడానికి సిద్ధంగా లేదు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక కన్నేసి ఉంచారు. తమ పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకత్వంలో ఎవరైనా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారా? అనే దానిపై ఆరా తీశారు. ఎక్కడా ఆ ఛాయ లేకపోవడంతో ఊపిరి పీల్చు కున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పాదయాత్రకు వెళ్లే జనంపై దృష్టి పెట్టనున్నారు. సభలు, సమావేశాలకు ఏ ఏ వర్గాల ప్రజలు హాజరవుతున్నాయనే దానిపై అంచ నాకు రావాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే జనా న్ని బట్టి నియోజకవర్గంలో తమ అంచనాలను సవరిం చుకోవడం, లేదా పార్టీ బలోపేతమయ్యేలా జాగ్రత్తపడ డం వంటి అంశాలను వైసీపీ నేతలు పరిగణనలోకి తీసుకుంటున్నారు.

 

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవలే డెల్టా, మెట్ట ప్రాంతానికి చెందిన సీనియర్‌ నేతలు కొందరితో మంతనాలు నడిపారు. వారిలో హరిరామజోగయ్య, కరాటం రాంబాబు వంటి నాయకులు ఉన్నారు. వీరు విధించిన షరతులతో అధినాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రప్పించుకోలేక చివరికి ఈ ప్రయత్నాలను తాత్కాలికంగా విరమించారు. ద్వితీయశ్రేణిలో మాత్రం ఆర్థికంగా కొంచెం పైచేయిగావున్న కొందరు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని గుర్తించారు.

 

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు సీనియర్‌ నేతలు నేరుగా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. వీరిలో కాంగ్రెస్‌ మాజీ నేతలు ఉన్నారు. వీలు కుదిరితే ఎవరినీ వదులుకోరాదని, కేవలం నియోజకవర్గం మీద గట్టి పట్టు కలిగిన నేతలకే ప్రాధాన్యత ఉంటుందని వైసీపీ నాయకత్వం చెబుతోంది. దీనిని బట్టి చూస్తే రాబోయే నెల రోజుల్లో ఊహించని విధంగా కొందరు వైసీపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఒక అంచనా. టీడీపీ మాత్రం తమ పార్టీకి డోకా లేదని ధీమాతో ఉంది. సాధ్యమైనంత మేర జగన్‌ పాదయాత్ర దరిమిలా వ్యూహాలను మార్చు కునేందుకు సిద్ధమవుతోంది.

Related Posts