భద్రాద్రి కొత్తగూడెం
టీఆర్ఎస్ లో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియా వేదికగా మాజీ ఎంపీ టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శలు గుప్పించచాయి. నిన్న అశ్వాపురం మండలం మల్లెల మడుగు లో అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా పొంగులేటి, రేగా వర్గీయుల మధ్య వాగ్వాదం, పలువురు కార్యకర్తలకు గాయాలు అయిన విషయం తెలిసిందే. రాష్ట్ర నేత అయిన పొంగులేటి ని రేగా ఎలా అడ్డుకుంటారు అని పొంగులేటి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు రేగా వర్గీయులను పోలీస్ కార్లలో తిప్పుతూ పొంగులేటి వర్గీయులపై దాడులు చేపించారు పొంగులేటి వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసుల పక్షపాత వైఖరిపై ఎస్పీ,డీజీపీ ని కలిసి పిర్యాదు చేస్తాం అంటున్నారు. మరోవైపు రేగా కాంతారావు సోషల్ మీడియా పోస్ట్ లు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పొంగులేటి పినపాక పై యుద్ధానికి వస్తే ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు గాజులు వేసుకోని కూర్చోని చూడరు అంటూ పొంగులేటి ని రేగా కాంతారావు హెచ్చరించారు. పొంగులేటి కి పినపాక నియోజకవర్గం తో పని ఏంటి అంటూ అయన ప్రశ్నించారు.