YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఆగని రాజకీయ హత్యలు

 ఏపీలో ఆగని రాజకీయ హత్యలు

ఒంగోలు, ఫిబ్రవరి 28,
సిపిఐ సీనియర్ నాయకుడు కే. నారాయణ ఆంధ్ర ప్రదేశ్’లో రోజు రోజుకు దిగజారి పోతున్న శాంతి భద్రతల పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్త పరిచారు.రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరిగే అవకాశం ఉందని సంచలన ప్రకటన చేశారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచరణంలో వెలుగు చూస్తున్న అంశాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని, రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న... సీబీఐ అధికారుల మీదే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితిని చూస్తే, ప్రభుత్వం ఎవరినో రక్షించే ప్రయత్నం చేస్తోందని పిస్తోందని నారాయణ అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగిందో అందరికీ అంతా అర్థమైపోయిందని ఈ విషయంలో జగన్ రెడ్డి  కుటుంబం నైతిక బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం నారాయణ స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయ కలహాలు నేపధ్యంగా సాగుతున్న రాజకీయ హత్యలు ఇంతటితో ఆగవని.. భవిష్యత్‌లో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం హత్యలు జరుగుతాయని నారాయణ అన్నారు. వీటిని నివారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ హత్యలు జరగకుండ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అదలా ఉంటే నిజంగానే సిపిఐ నారాయణ అనుమానిస్తునట్లుగానే వివేకా హత్య కేసు విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు పలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని,రాజకీయ నాయకులు, విశ్లేషకులే కాదు, సామాన్య పజలు కూడా ఆందోళన వ్యక్త పరుస్తున్నారు,నిజానికి ఇదొకటే కాదు, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, హింసా రాజకీయాలకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజావేదికను కూల్చి వేశారు, ఇక అది మొదలు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు , నాయకులపై దాడులు, పట్టపగలు నడి రోడ్డు హత్యలు, మాన భంగాలు వంటినేరాలు పెరిగిపోతూనే ఉన్నాయనేది కాదనలేని నిజం.  జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు పది మండికి పైగా టీడీపీ నాయకులు హత్యకు  గురయ్యారని స్వయంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పలుమార్లు ఆరోపించారు. ఇక నాయకుల అరెస్టులు, పార్టీ కార్యాలయాల పై దాడుల విషయం అయితే చెప్పనే అక్కర లేదు.అందుకే, ఒక్క నారాయణే కాదు, పలువురు రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నారు.

Related Posts