YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

ఓపీలేని ఆస్పత్రి

ఓపీలేని ఆస్పత్రి

జిల్లా కేంద్రాసుపత్రిలో ఉన్న 17 పేయింగ్‌ గదులకు మరమ్మతులు చేసి వెల్‌నెస్‌ సెంటర్‌ను అందుబాటుల్లోకి తీసుకు రావడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక్కడ ఓపీ గదులతో పాటు ప్రత్యేక ల్యాబ్‌లు, నిరీక్షణ గది, కంప్యూటర్‌ హాల్‌ నిర్మాణాలు ఏర్పాటు చేWయాల్సి ఉంది. దీంతో పాటు దంత వైద్యం, గుండె, మూత్ర పిండాలు, న్యూరాలజీ, అంకాలజీ వైద్యులతో పాటు 40 మంది వరకు సిబ్బంది 24 గంటల పాటు సేవలు అందించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో రక్త పరీక్షలు, ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, స్కానింగ్‌ వంటి పరీక్షలు నిర్వహించాలి. మెరుగైన వైద్యం అవసరమైతే హైదరాబాద్‌, విజయవాడ వంటి ప్రాంతాల్లో బాధితులు కోరుకున్న ఆసుపత్రులకు ప్రత్యేక అంబులెన్సులో తరలించాలి.

 

ఆసుపత్రి ప్రత్యేక విభాగంలో జరుగుతున్న పనులు గడువు ముగిసినా పూర్తి కావడం లేదు. గత ఏడాది నవంబర్‌ నాటికే  వెల్‌నెస్‌ సెంటర్‌ అందుబాటులోకి రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పాత గోడలకు టైల్స్‌, రంగులు అద్ది రూ.40 లక్షలు వృథా చేశారని ప్రారంభానికి ముందే ఆసుపత్రి విభాగాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మిగతా జిల్లాల్లో ఇలాంటి కేంద్రాల ద్వారా  వైద్యం అందుతున్నా ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెల్‌నెస్‌ సెంటర్‌ త్వరితగతి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.

 

జిల్లా కేంద్రాసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, పాత్రికేయులకు ఏడాది క్రితం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. బాధితులకు ప్రత్యేకంగా మందుల సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనికోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓపీ (అవుట్‌ పేషెంట్‌) అందుబాటులో ఉంటుందని చెప్పారు. కానీ నేటికి ఒక్కరోగికి కూడా వైద్యం అందించిన దాఖలాలు లేవు. ఆసుపత్రి నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా కనీసం ఆయా విభాగాల రూములకు తలుపులు కూడా తెరవని పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యశ్రీ పథకం నుంచి దీని నిర్వహణ కోసం ప్రత్యేక నిధులు వస్తున్నా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంతో వైద్యం మూలన పడేశారు.

 

రాష్ట్ర విభజన అనంతరం పాత పది జిల్లాల కేం‌్రద్రాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అడుగేసింది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటి ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఒక్కో కేంద్రానికి రూ.40 లక్షలు కేటాయించింది. నిర్మాణం పూర్తికి మూడు నెలలు గడువు విధించింది. అందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 40 వేల మంది ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులు, 10 వేల మంది మీడియా ప్రతినిధులకు మెరుగైన వైద్య సేవలకుగాను కేంద్ర ఆసుపత్రిలో వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు అంగీకరించింది. నిధులు మంజూరు చేసింది.  ఉమ్మడి జిల్లాలో వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులకు మెరుగైన వైద్యం అందించాలన్న సర్కారు సంకల్పం నత్తకు మేనత్తలా సాగుతోంది.. గుత్తేదారు నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి ప్రభుత్వ ప్రయత్నాన్ని నీరుగారుస్తున్నాయి. ఈ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన గడువు ముగిసినా నిర్మాణం మాత్రం అందుబాటులోకి రావడం లేదు. దీంతో అర్హులు మెరుగైన వైద్యం కోసం నిరీక్షించాల్సి వస్తోంది.

Related Posts