YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగనన్న తోడు పథకం నిధులు విడుదల

జగనన్న తోడు పథకం నిధులు విడుదల

తాడేపల్లి
జగనన్న తోడు పథకం నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈసందర్భంగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నిధులు విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. చిరు వ్యాపారులకు రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని అన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. జగనన్న తోడు పథకం కింద 5,10,462 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.526.62కోట్లు జమ అయ్యిందన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల రుణం అందిస్తున్నట్లు తెలిపారు. వడ్డీలేని రుణం రూ.510.46కోట్లు అన్నారు. వడ్డీ రీయింబర్స్ మెంట్ రూ.16.16కోట్లు అని సీఎం జగన్ తెలిపారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశా పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రుణాలు క్రమం తప్పకుండా బకాయిలు  చెల్లిస్తుంటే మీకు మళ్లీ రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని అన్నారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం ఈ పథకానికి అర్హులై ఉండి రుణం రాకపోతే.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. లబ్ధిదారులకు సందేహాలుంటే 08912890525కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం దొరుకుతుందని అన్నారు. ఎటువంటి అవినీతికి తావులేకుండా లబ్దిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికైనా డబ్బులు రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Related Posts