న్యూ ఢిల్ల్లీ ఫిబ్రవరి 28
రష్యాఉక్రెయిన్ లయుధ్దం తీవ్రమవుతోంది. కీవ్ నగరాన్ని చేజిక్కించుకునేందుకు రష్యన్ సైనిక దళం ఆదివారం రాత్రినుంచి పెద్ద ఎత్తున సన్నాహాలు చేసింది. సుమారు మూడు మైళ్ల పొడుగు ఉన్న రష్యా సైనిక కాన్వాయ్ కీవ్ రూట్లో వెళ్తున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు. ఇప్పటికే కీవ్ నగరంలో రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య భీకర పోరు నడుస్తోంది. రాజధాని కీవ్ మార్గంలో ఉన్న ఓ హైవేపై .. రష్యా సైనిక కాన్వాయ్ మూడు మైళ్ల పొడుగు ఉన్నట్లు సమాచారం. ఇవాన్‌వీక్ ప్రాంతంలో పి-02-02 రోడ్డుపై సైనిక కాన్వాయ్ వెళ్తున్నట్లు గుర్తించారు. రాజధాని కీవ్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో రష్యాన్ భద్రతాబలగాలు మోహరించాయి. ఆ కాన్వాయ్‌లో యుద్ధ ట్యాంక్‌లు, ఇన్‌ఫాంట్రీ వాహనాలు, ఆర్టిల్లరీ దళాలు, ఇంధనం వాహనాలు ఉన్నట్లు తెలిపారు.