ఖమ్మం, ఫిబ్రవరి 28
భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ సూపర్‌మార్కెట్ బిగ్‌బాస్కెట్ (టాటా ఎంటర్‌ప్రైజ్)తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ తమ నూతన స్టోర్‌ను ఖమ్మంలో ప్రారంభించింది. భారతదేశంలో దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న బిగ్‌బాస్కెట్ , నాణ్యత కలిగిన సరుకులను అతి తక్కువ ధరలకు అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలోని వినియోగదారులకు అందించాలనే లక్ష్యంలో భాగంగా ఖమ్మంలో తమ కార్యకలాపాలు ప్రారంభించింది.ఖమ్మం నగరంలోని వినియోగదారులు ఇప్పుడు బిగ్‌బాస్కెట్ యాప్ ద్వారా నూనెలు, మసాలాలు, పర్సనల్ కేర్, బ్యూటీ, బ్రాండెడ్ ఫుడ్, కిచెన్ ,నిత్యావసరాలతో కూడిన విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఆర్డర్ చేయవచ్చు. అంతేకాదు, వినియోగదారులు ఈ స్టోర్‌లను సందర్శించడంతో పాటుగా తమకు కావాల్సిన వస్తువులను కూడా ఆర్డర్ చేయవచ్చు. అక్కడ స్టోర్ సిబ్బంది సైతం వీరికి సహాయపడగలరు.ఈ ప్రారంభం గురించి హరికృష్ణా రెడ్డి, రీజనల్ బిజినెస్ హెడ్, బిగ్‌బాస్కెట్ మాట్లాడుతూ "అతి తక్కువ ధరలలో ఖమ్మం ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి బిగ్‌బాస్కెట్ కృషి చేస్తోంది. లక్షలాది మంది భారతీయులు తమ నమ్మకాన్ని చూపుతున్న టాటా గ్రూప్ సంస్ధగా బిగ్ బాస్కెట్ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. భారతదేశంలో 200 మిలియన్‌లకు పైగా ఇంటర్నెట్, రేపటి తరపు ఈ-కామర్స్ వినియోగదారులు ఖమ్మం లాంటి పట్టణాల నుంచి రానున్నారు. ఖమ్మం వాసులకు నమ్మకమైన గ్రోసరీ భాగస్వామిగా తాము నిలువాలనుకుంటున్నాము''అని అన్నారు.