YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివేకా హత్యను జగనన్న రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారు

వివేకా హత్యను జగనన్న రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారు

అమరావతి ఫిబ్రవరి 28
మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసుపై వివేకా కూతురు సునీతారెడ్డి వాంగ్మూలంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ జగన్‌ చిన్నాన్న వివేకా హత్యను రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసని ఆమె అన్నారు. నాన్న హత్యపై భారతి, జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారని, ఈ హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెబితే ‘వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో’ అని అన్యాయంగా మాట్లాడారని వెల్లడించారు. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడు . ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందని అన్నారని’ ఆమె వివరించారు. సీబీఐ విచారణ కోసం తాను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల అన్నారని సునీతా రెడ్డి గుర్తు చేశారు. అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్లోి హత్య సమయంలో ఆధారాలను మాయం చేశారని పేర్కొన్నారు. అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, మనోహర్‍ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని తన వాంగ్మూలంలో వివరించారు. నా తండ్రి వివేకా అంటే ఎంపీ అవినాశ్కు గిట్టదని, హంతకులకు శిక్ష పడాలని ఆమె డిమాండ్‌ చేశారు. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానని ఆమె వెల్లడించారు.

Related Posts