YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అవినాష్ రెడ్డి పై హత్యా నేరం ఉంది స్పీకర్ ఓం బిర్లాకు సునీతా లేఖ

అవినాష్ రెడ్డి పై హత్యా నేరం ఉంది స్పీకర్ ఓం బిర్లాకు సునీతా లేఖ

హైదరాబాద్, ఫిబ్రవరి 28,
ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. తాజాగా వైఎస్‌ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సీబీఐ వాంగ్మూలంలో చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. మరోవైపు.. ఈ వ్యవహాంలో లోక్‍సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి… వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని లేఖలో స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, సీబీఐకి తానిచ్చిన వాంగ్మూలాన్ని స్పీకర్‌కు రాసిన లేఖతో జతపరిచారు సునీతారెడ్డి.. అంతేకాకుండా సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‍కు అందజేశారు.ఇక, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను బయటపెట్టిన విషయం తెలిసిందే.. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న ఆమె.. నాన్న హత్యపై వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి చాలా తేలిగ్గా స్పందించారని.. నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని.. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడని చెప్పారని.. ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందన్నారని పేర్కొన్నారు. నా తండ్రి హత్యను వైఎస్‌ జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి తెలిపిన ఆమె.. సీబీఐ విచారణ కోసం నేను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని పేర్కొన్నారు.. అవినాష్‌ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‍లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు.. అవినాష్‌ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్‍ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సీబీఐకి తెలిపారు. నా తండ్రి అంటే ఎంపీ అవినాష్‌కు గిట్టదు అని పేర్కొన్నారు.. హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు సునీతారెడ్డి.

సంచలనం రేపుతున్న సునీతా కామెంట్స్ :
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన కూతురు సునీతారెడ్డి… ఈ కేసులో సీబీఐకి సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను బయటపెట్టారు.. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న ఆమె.. నాన్న హత్యపై భారతి, జగన్ చాలా తేలిగ్గా స్పందించారని పేర్కొన్నారు.. నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని వాంగ్మూలం ఇచ్చిన ఆమె.. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడని చెప్పారని.. ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందన్నారని తెలిపారమె.నా తండ్రి హత్యను వైఎస్‌ జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి తెలిపారు సునీతారెడ్డి… సీబీఐ విచారణ కోసం నేను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారన్న ఆమె.. అవినాష్‌ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‍లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు.. అవినాష్‌ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్‍ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సీబీఐకి వివరించిన ఆమె.. నా తండ్రి అంటే ఎంపీ అవినాష్‌కు గిట్టదు అని పేర్కొన్నారు.. హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు సునీతారెడ్డి.

Related Posts