YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బడ్జెట్ సమావేశాల నిర్వహణ కసరత్తు

బడ్జెట్ సమావేశాల నిర్వహణ కసరత్తు

హైదరాబాద్, మార్చి 1,
మార్చి నెల వచ్చేసింది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి నెలరోజులవుతోంది. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి 6న బడ్జెట్‌ ఆమోదంపై తెలంగాణ కేబినెట్‌ భేటీ జరగనుంది. సభ ఎన్ని రోజులు జరగాలనేది బీఏసీలో నిర్ణయించనున్నారు. మార్చి 7న ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 2014, 1970లోనూ గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కసరత్తు చేస్తోంది. 2022- 23 రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారుచేయడానికి సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్‌లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి త్వరలో తేదీలను నిర్ణయిస్తారు. శాసనసభ, మండలిని సమావేశ పర్చాల్సిన తేదీలపై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే నెల రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ అధికారులు రెడీ అవుతున్నారు. ఉద్యోగుల వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయానికి సంబంధించిన పద్దులు సిద్ధం అయ్యాయని తెలుస్తోంది. అలాగే వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ఇతరత్రాలకు సంబంధించిన ప్రగతిపద్దు తయారీ శరవేగంగా సాగుతోంది.ఉద్యోగుల వేతన సవరణ, కొత్త ఉద్యోగాల నియామకాలకు అవసరమైన మొత్తాన్ని నిర్వహణపద్దులో సర్దుబాటు చేశారు. .రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మార్చి నెలాఖరులోగా ఆమోదించాలి. ఆలోగా ఉభయ సభలు పద్దుకు ఆమోదం తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మాణం చేసిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి.. ఆలయ మహా కుంభ సంప్రోక్షణ ముహూర్తాన్ని మార్చి 28న ఖరారు చేశారు. ఆ ముహూర్తంలోగా బడ్జెట్ సమావేశాలు ముగించనున్నారు. ఇవాళ్టి భేటీ అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళతారని తెలుస్తోంది. ఫ్రంట్ పనుల్లో భాగంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తో భేటీ అవుతారు సీఎం.

Related Posts